Maa Inti Bangaram Teaser: సమంత ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘మా ఇంటి బంగారం’. అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఫస్ట్ గ్లింప్స్ విడుదలైంది. ఇది హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా మెప్పించనుంది. సామ్‌ను సరికొత్త పాత్రలో ఆవిష్కరించనున్న సినిమాగా ఇది అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
రాజ్ నిడిమోరు క్రియేట్ చేసిన ‘మా ఇంటి బంగారం’ను నందినీ రెడ్డి డైరెక్ట్ చేశారు. ‘ఓ బేబి’ తర్వాత సమంత, నందినీ రెడ్డి కాంబోలో వస్తోన్న రెండో చిత్రమిది. టీజర్‌ను గమనిస్తే..కామెడీతో నవ్వించే సినిమా ఉన్నట్లుండి రియలిస్టిక్ ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్‌గా జరిగే మార్పును మనం స్పష్టంగా గమనించవచ్చు.

రెండు భిన్న కోణాలు..
టీజర్‌లో సమంతను సాధారణమైన గృహిణి పాత్రలో చూపించారు. అయితే ఆమె తన అత్తగారింటికి వెళ్లిన తర్వాత పరిస్థితులు తలకిందులవుతాయి. నవ్వుతూ మృదు స్వభావిగా కనిపించే ఆమె ఉన్నట్లుండి ఎదురుదాడి చేసేంత శక్తివంతురాలిగా మారుతుంది. ఇందులో సమత స్టైలిష్‌గా కాకుండా రియాలిటీకి దగ్గరగా ఉండేలా చూపించారు. ఆమె యాక్షన్ సన్నివేశాల్లో వేగంగా కదలటమే కాదు.. ఆమెలోని ఎమోషన్స్‌ను కూడా లోతుగా ఆవిష్కరించే ప్రయత్నం చేశారు మేకర్స్. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై సమంత రూత్ ప్రభు, రాజ్ నిడిమోరు, హిమాన్క్ దువ్వూరు కలిసి నిర్మిస్తున్నారు.
సమంత లీడ్ రోల్ చేస్తోన్న ‘మా ఇంటి బంగారం’ చిత్రంలో దిగంత్, గుల్షన్ దేవయ్య కీలక పాత్రల్లో నటిస్తుండగా, సీనియర్ నటి గౌతమి, మంజుషా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు ఓం ప్రకాశ్ సినిమాటోగ్రఫీ, సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్నారు. కథనం, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌ను వసంత్ మారిన్‌గంటి, రాజ్ నిడిమోరు రచించగా, ప్రముఖ రచయిత సీతా ఆర్ మీనన్ క్రియేటివ్ సూపర్‌విజన్ చేస్తున్నారు.

