వక్కలు తింటే కలిగే హెల్త్ బెనిఫిట్స్ మీకు తెలుసా.. అదిరిపోయే ప్రయోజనాలు మీ సొంతం!

వక్కలు తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది, రోగనిరోధక శక్తి పెరుగుతుంది, నోటి దుర్వాసన తగ్గుతుంది, రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించబడతాయి మరియు రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో బాధపడేవారికి ఉపశమనం కలుగుతుంది. వక్కలు జీర్ణ రసాలను ఉత్పత్తి చేయడంలో సహాయపడతాయి, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి మరియు అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తాయి. వక్కలలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి, ఇవి శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

వక్క నోటి దుర్వాసనను తొలగించడానికి మరియు పళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి. కొన్ని పరిశోధనలు వక్కను పరిమిత మోతాదులో తీసుకుంటే, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుందని చెబుతున్నాయి. వక్కలు రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో బాధపడేవారికి ఉపశమనం కలిగించడంలో తోడ్పడతాయి. వక్కలు కడుపులోని క్రిములను చంపుతాయి.

వక్కను దంచి దంతాలకు మర్దన చేయడం వల్ల దంత వ్యాధులు నయమై నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. వక్కలు అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారికి మేలు చేస్తాయి. అయితే వక్కలు మరీ ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. తరచూ వక్కలు, ఆకులు కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి హానికరమని , క్యాన్సర్లు రావడానికి అవకాశం ఉందని నిపుణులు చెబుతారు. అదేపనిగా నమలడం వల్ల మతిమరుపు వచ్చే అవకాశం ఎక్కువని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వక్కలు, వక్కపొడిని గర్భిణులు తీసుకోకూడదు.

ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి సమస్యలను తగ్గించడానికి వక్క తోడ్పడుతుంది. వక్కలో నొప్పి తగ్గించే గుణం ఉండటం వల్ల యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆహారం బాగా అరిగేలా చేయడంలో వక్కులు సహాయపడతాయి. వక్కలు తీసుకోవడం ద్వారా శరీరంలో ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి.