యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటే గౌట్, మూత్రపిండాల్లో రాళ్లు వంటి సమస్యలు వస్తాయి. గౌట్ లో కీళ్లలో నొప్పి, వాపు, ఎరుపు, అసౌకర్యం ఉంటాయి. మూత్రపిండాల్లో రాళ్లు ఉంటే నడుము నొప్పి, మూత్రంలో రక్తం, తరచుగా మూత్ర విసర్జన వంటి లక్షణాలు కనిపిస్తాయి. కీళ్లలో నొప్పి, వాపు, ఎరుపు, అసౌకర్యం మొదలై బొటనవేలులో నొప్పి మొదలుకావడంతో పాటు నొప్పి తీవ్రంగా ఉంటుంది, ఇది రోజులు లేదా వారాలపాటు ఉంటుంది.
నడుము మరియు పొత్తికడుపులో తీవ్రమైన నొప్పి, మూత్రంలో మంట, తరచుగా మూత్ర విసర్జన లాంటి సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే యూరిక్ యాసిడ్ సమస్య బారిన పడినట్టేనని గుర్తుంచుకోవాలి. వికారం, వాంతులు, కండరాల బలహీనత, అలసట, ఇతర మూత్ర సంబంధిత సమస్యలు ఉంటే వైద్యులను సంప్రదించి సలహాలు, సూచనలు తీసుకోవాలి.
హైపో థైరాయిడిజం, అధిక బరువు, ప్యూరిన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం, మూత్రపిండాల్లో సమస్యలు, శారీరక శ్రమ లేకపోవడం, వయసు పైబడడం వంటివి యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలు అని చెప్పవచ్చు. బేకన్, టర్కీ, దూడ మాంసం, వెనిసన్, కాలేయం వంటి అవయవ మాంసాలు వంటి కొన్ని మాంసాలు, ఆంకోవీస్, సార్డినెస్, హెర్రింగ్, మస్సెల్స్, కాడ్ ఫిష్, స్కాలోప్స్, ట్రౌట్, హాడాక్ వంటి కొన్ని చేపలు, సీఫుడ్, షెల్ఫిష్ కూడా యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణమవుతాయి.
యూరిక్ యాసిడ్ విపరీతంగా పెరిగినప్పుడు వికారం సమస్య ఉంటుంది. ముఖ్యంగా బలహీనంగా అనిపించడం, వాంతి చేయాలనిపించడం ఇలాంటి లక్షణాలు కూడా ఉంటాయి. ఈ లక్షణాలలో ఏ లక్షణం కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స చేయించుకుంటే మంచిది. యూరిక్ యాసిడ్ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే దీర్ఘకాలంలో ఇబ్బందులు ఎదురవుతాయి.