నేచురల్ స్టార్ నాని నటిస్తున్న హిట్ 3 మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మే 1న విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రానికి శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. హిట్ యూనివర్స్‌లో మూడో భాగంగా వస్తున్న ఈ మూవీకి మాస్ ఆడియెన్స్‌లో మంచి క్రేజ్ ఏర్పడింది. రీసెంట్‌గా విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్‌తో హైప్ మరింత పెరిగింది. ఇప్పుడు సినిమా టికెట్ రేట్లపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
తెలంగాణలో మల్టీప్లెక్స్ లలో ఇప్పటికే టికెట్ ధర రూ.295గా, సింగిల్ స్క్రీన్స్‌లో రూ.175గా ఉంది. ఈ ధరలు తక్కువగా లేవు కనుక, హిట్ 3 కోసం ప్రత్యేకంగా టికెట్ రేట్లు పెంచాల్సిన అవసరం మేకర్స్‌కు లేదని సమాచారం. అందుకే ఎలాంటి అదనపు అనుమతులు తీసుకోకుండా అదే ధరలను ఫాలో అవుతున్నారు. ఓవర్సీస్‌లో కూడా హిట్ 3 హార్డ్ డిస్కులు ముందుగానే పంపించడంతో రిలీజ్ రెడీగా ఉంది.
ఇక ఆంధ్రప్రదేశ్ విషయంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. మల్టీప్లెక్స్‌లలో టికెట్ ధరలు రూ.177, సింగిల్ స్క్రీన్‌లలో రూ.110-140 మధ్య ఉన్నాయి. ఇటీవల విడుదలైన కొన్ని సినిమాలకు ప్రభుత్వం ప్రత్యేక జీవోలు మంజూరు చేసి టికెట్ ధరలు పెంచింది. ఇప్పుడు హిట్ 3 మేకర్స్ కూడా ఇదే మార్గాన్ని అనుసరిస్తారా అనే విషయం హాట్ టాపిక్‌గా మారింది.
మేకర్స్ కోరుకుంటే ఏపీ ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం ఖాయం. అయితే టికెట్ ధరలు పెంచితే, సినిమా టాక్ బాగుంటే లాభం దక్కుతుంది. కానీ ఫలితం ఆశించిన స్థాయిలో లేకపోతే, టికెట్ ధరలపై విమర్శలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో హిట్ 3 మేకర్స్ ఎంతో జాగ్రత్తగా నిర్ణయం తీసుకోబోతున్నారని టాక్ వినిపిస్తోంది.