మనలో చాలామంది ఇతరులకు అప్పు ఇచ్చి ఆ అప్పు తిరిగి రాక ఇబ్బందులు పడుతుంటారు. కొన్నిసార్లు డబ్బు వల్ల బంధాలు, అనుబంధాలు పోగొట్టుకునే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పవచ్చు. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనకు తిరిగి రాని డబ్బును సైతం సులువుగా తిరిగి పొందే అవకాశాలు అయితే కచ్చితంగా ఉంటాయని చెప్పవచ్చు. జ్యోతిష్యం, వాస్తు శాస్త్రంకు సంబంధించిన కొన్ని విషయాలను గుర్తుంచుకుంటే మంచిది.
లక్ష్మీదేవిని పూజించడం ద్వారా నిలిచిపోయిన డబ్బును సులువుగా తిరిగి పొందే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. లక్ష్మీదేవికి పూజ సమయంలో కోడిని సమర్పించడం ద్వారా ఏవైనా దోషాలు ఉన్నా ఆ దోషాలు తీరే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. అన్ని బాధలను తొలగించే దేవుళ్లలో భజరంగబలి ఒకరు కాగా మంగళవారం హనుమంతుడిని పూజించడం ద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి.
ప్రతిరోజూ సాయంత్రం సమయంలో దీపం వెలిగించి పూజ చేయడం ద్వారా మంచి ఫలితాలను కచ్చితంగా పొందే అవకాశం ఉంటుంది. కర్పూరం, రెండు లవంగాలు వెలిగించడం ద్వారా ఎక్కడైనా డబ్బులు స్టక్ అయిపోతే ఆ డబ్బులను వెంటనే పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ విధంగా చిట్కాలను పాటించడం ద్వారా నష్టపోయే అవకాశాలు తక్కువగా ఉంటాయని చెప్పవచ్చు.
ప్రస్తుత కాలంలో బాగా పరిచయమై కచ్చితంగా డబ్బులు తిరిగి చెల్లిస్తారనే నమ్మకం ఉన్నవాళ్లకు మాత్రమే డబ్బులు ఇస్తే మంచిది. డబ్బుల విషయంలో పొరపాట్లు చేస్తే మాత్రం ఇబ్బందులు పడక తప్పదని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. డబ్బు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.