Keeravani: కీరవాణి వ్యభిచారి… 4 దశాబ్దాలుగా అదే పని… డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు!

Keeravani: ప్రముఖ సింగింగ్ రియాలిటీషో పాడుతా తీయగా సింగర్ ప్రవస్థి పేరు గత కొద్ది రోజులుగా ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో మనకు తెలిసిందే. ఈమె ఈ కార్యక్రమం గురించి సంచలన ఆరోపణలు చేశారు. ప్రొడక్షన్ టీం గురించి అలాగే కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ వారు కూడా బాడీ షేమింగ్ కామెంట్లు చేస్తారని విమర్శించారు. అలాగే ఈ కార్యక్రమానికి జడ్జిలుగా వ్యవహరిస్తున్న కీరవాణి చంద్రబోస్ సునీతపై కూడా ఈమె ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

జడ్జిలు కంటెస్టెంట్ ల పట్ల పక్షపాతం చూపిస్తారని నన్ను అయితే ఒక చీడపురుగును చూసినట్టు చూసేవారని తెలిపారు. ముఖ్యంగా సునీత నన్ను చాలా ఘోరంగా అవమానించే వారిని తెలిపారు. అయితే ఈ ఆరోపణలపై సింగర్ సునీత ఇప్పటికే స్పందిస్తూ తనదైన శైలిలోనే సమాధానం ఇచ్చారు కానీ కీరవాణి చంద్రబోస్ మాత్రం ఈ వివాదం పై స్పందించలేదు.

ఇదిలా ఉండగా తాజాగా సింగర్ ప్రవస్తికి మద్దతుగా ప్రముఖ డైరెక్టర్ గీతాకృష్ణ నిలిచారు. తాజాగా ఈయన ఒక ఇంటర్వ్యూ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కీరవాణి నాకు ఒక 8 సంవత్సరాలుగా బాగా తెలుసని తెలిపారు. కానీ ఆయన గురించి 40 సంవత్సరాలుగా అన్ని విషయాలు తెలుసని తెలిపారు.

కీరవాణి ఒక వ్యభిచారి.అమ్మాయిలను సప్లై చేసే వాళ్ళతో స్కూల్ గర్ల్స్ కావాలని అడిగేవాడట అంటూ కీరవాణి పై ఫోక్స్ కేసు పెట్టాలని సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. ఈ విషయాలన్నీ నాకు ఎప్పుడో తెలుసు కానీ ఎందుకు బయట పెట్టాలని అనుకునేవాడిని అంటూ కీరవాణి గురించి గీతాకృష్ణ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనగా మారాయి. టెలివిజన్ అనేది గ్లామర్ ఫీల్డ్‌ కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలంటూ వివరించాడు. ప్రస్తుతం గీత కృష్ణ చేసిన వ్యాఖ్యలు ఫిలిం సర్కిల్లో తెగ చక్కర్లు కొడుతుంది .మరి ఈ వ్యాఖ్యలపై కీరవాణి స్పందన ఎలా ఉంటుందనేది తెలియాల్సి ఉంది.