నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. వ్యవసాయ శాఖలో 195 ఉద్యోగ ఖాళీలు?

Job-Vacancy

అగ్రికల్చరల్ సైంటిస్ట్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం తాజాగా జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. మొత్తం 195 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. https://www.asrb.org.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 10వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉంది. సీబీటీ పరీక్ష ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

కనీసం 21 సంవత్సరాలు గరిష్టంగా 35 సంవత్సరాల వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రిజర్వేషన్ల ఆధారంగా వయో పరిమితిలో స్వల్పంగా సడలింపులు ఉంటాయని తెలుస్తోంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్య్వ్యూ, మెడికల్ టెస్ట్ ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియను నిర్వహిస్తారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు గరిష్టంగా 1,77,500 రూపాయల వరకు వేతనం లభిస్తుంది.

ఈ ఉద్యోగాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు 1000 రూపాయలు దరఖాస్తు ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. 2023 సంవత్సరం ఏప్రిల్ 10వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉండనుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేస్తే మంచిదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వరుస జాబ్ నోటిఫికేషన్లు నిరుద్యోగులకు బెనిఫిట్ కలిగిస్తున్నాయి.

https://www.asrb.org.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. తక్కువ సంఖ్యలో పోస్టులు ఉండటంతో ఈ ఉద్యోగాలకు పోటీ ఎక్కువగానే ఉంటుంది. నిరుద్యోగులు ఈ ఉద్యోగల కోసం వెంటనే దరఖాస్తు చేస్తే మంచిది.