ఎల్ఐసీ బ్లాక్‌బస్టర్ స్కీమ్.. రూ.165 పొదుపుతో రూ.37 లక్షలు పొందే ఛాన్స్!

దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలని భావించే వాళ్లకు మనీ బ్యాక్ పాలసీ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఈ పాలసీలలో ధన రేఖ పాలసీ ఒకటి కాగా ఒకేసారి ప్రీమియం కట్టేసి ఈ పాలసీని తీసుకోవచ్చు. లిమిటెడ్ పీరియడ్ ప్రీమియం ఆప్షన్ తో ఈ పాలసీ అమలవుతోంది. ఎంచుకునే టెన్యూర్ ఆధారంగా ప్రీమియంలో మార్పు ఉంటుందని సమాచారం.

30 సంవత్సరాల వయస్సు ఉన్నవాళ్లు 10 లక్షల బీమా తీసుకుంటే రోజుకు 165 రూపాయలు పొదుపు చేస్తే సరిపోతుంది. ఈ పాలసీ తీసుకున్న వాళ్లు 40వ సంవత్సరంలో మెచ్యూరిటీ డబ్బులు పొందే ఛాన్స్ ఉంటుంది. 20, 25, 30, 35 సంవత్సరాలలో 2 లక్షల రూపాయల చొప్పున పొందే అవకాశం ఉండగా మెచ్యూరిటీ సమయంలో ఏకంగా 29 లక్షల రూపాయలు పొందవచ్చు.

పాలసీ టర్మ్ లో సగం సంవత్సరాలు మాత్రమే ప్రీమియంను చెల్లించాల్సి ఉంటుంది. ఈ పాలసీ తీసుకున్న వాళ్లు యాక్సిడెంటల్ బెనిఫిట్ రైడర్ ను కూడా పొందవచ్చు. ఎంచుకునే టెన్యూర్ ఆధారంగా వచ్చే రాబడిలో కూడా మార్పులు ఉంటాయి. ఈ పాలసీ పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ప్రయోజనకరంగా ఉంటుంది. ఏజెంట్స్ ద్వారా ఈ పాలసీల గురించి తెలుసుకోవచ్చు.

ఎక్కువ మొత్తం డబ్బులు చెల్లించలేని వారికి మైక్రో పాలసీలు కూడా అందుబాటులో ఉంటాయి. ఏజెంట్ల ద్వారా పాలసీలను కొనుగోలు చేయడం ఇష్టం లేని వారు బ్రాంచ్ ను సంప్రదించడం ద్వారా స్కీమ్ లో చేరవచ్చు. బీమా పాలసీలను తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రావు.