ఎల్ఐసీ స్కాలర్ షిప్.. ఆ విద్యార్థులకు మాత్రం ఇది నిజంగా బంపర్ ఆఫర్!

దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా విద్యార్థులకు అదిరిపోయే తీపికబురు అందించింది. ఎల్ఐసీ గోల్డెన్ జూబ్లీ స్కాలర్ షిప్ స్కీమ్ 2024 పేరుతో ఈ స్కీమ్ ను అమలు చేస్తోంది. ఈ స్కీమ్ ద్వారా ప్రతిభ గల విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు అందనున్నాయి. పది, ఇంటర్, డిప్లొమా పాసైన వాళ్లు ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారని చెప్పవచ్చు.

గుర్తింపు పొందిన స్కూల్స్ లో కనీసం 60 శాతం మార్కులు సాధించిన విద్యార్థులు ఈ స్కాలర్ షిప్ కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మెడిసిన్, ఇంజనీరింగ్, గ్రాడ్యుయేషన్ చేయాలని భావించే వాళ్లకు ఈ స్కాలర్ షిప్ ఎంతగానో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు. విద్యార్థినులు స్పెషల్ గర్ల్ చైల్డ్ స్కాలర్ షిప్ కింద దరఖాస్తు చేసుకుంటే రెండేళ్లు స్కాలర్ షిప్ పొందే ఛాన్స్ ఉంటుంది.

సంస్థ వెబ్ సైట్ ద్వారా ఈ స్కాలర్ షిప్ కోసం సులువుగా దరఖాస్తు చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఈ నెల 22వ తేదీ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. స్కాలర్ షిప్ వల్ల విద్యార్థులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రయోజనం చేకూరుతుంది. ఈ విషయంలో ఎల్ఐసీని సైతం నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

ఎల్ఐసీ ప్రజలకు మేలు జరిగేలా ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తోంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ మంచి చేసే పథకాలపై ఎల్ఐసీ దృష్టి పెట్టింది.