లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నో పథకాలను అమలు చేస్తుండగా ఈ పథకాలలో ఎల్ఐసీ స్మార్ట్ పెన్షన్ ప్లాన్ కూడా ఒకటని చెప్పవచ్చు. పదవీ విరమణ పొందిన వారి అవసరాలను తీర్చే విధంగా ఈ ప్లాన్ అమలవుతుంది. ఈ పాలసీ నాన్ పార్టిసిపేటింగ్, నాన్ లింక్డ్, ఇండివిడ్యూవల్/ గ్రూప్, సేవింగ్స్, తక్షణ యాన్యుటీ ప్లాన్ కావడం గమనార్హం.
రిటైర్మెంట్ సేవింగ్స్ విభాగంలో భాగంగా ఈ స్కీమ్ అమలు కానుంది. ఈ ప్లాన్ గ్యారెంటీ పెన్షన్ అందించే సరికొత్త ప్లాన్ కావడం గమనార్హం. ఈ ఏడాది నుంచి ఈ పాలసీ అమలవుతుండటం గమనార్హం. ఈ పాలసీ తీసుకున్న వాళ్లు తర్వాత నెల నుంచే పెన్షన్ పొందే అవకాశాలుంటాయి. పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రత, భరోసా అందించే పాలసీలలో ఈ పాలసీ కూడా ఒకటని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.
కంపెనీ లాభ నష్టాలతో సంబంధం లేకుండా అమలయ్యే పాలసీ కావడంతో ఈ పాలసీ వల్ల ఎక్కువ బెనిఫిట్స్ పొందే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. 18 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ పాలసీని కొనుగోలు చేసే అవకాశం అయితే ఉంటుంది. ఈ స్కీమ్ కు కనీస పెట్టుబడి లక్ష రూపాయలు కాగా స్తోమత ఆధారంగా ఎంతైనా ఇన్వెస్ట్ చేయవచ్చు.
ఈ స్కీమ్ గురించి ఏవైనా సందేహాలు ఉంటే సమీపంలోని ఎల్.ఐసీ బ్రాంచ్ లేదా ఎల్.ఐసీ ఏజెంట్ ను సంప్రదిస్తే మంచిది. పాలసీదారు మరణిస్తే నామినీ డెత్ బెనిఫిట్స్ పొందే అవకాశాలుంటాయి. ఈ స్కీమ్ కు సంబంధించి ఇతర ఆప్షన్స్ కూడా పూర్తి వివరాలు తెలుసుకుని ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయాలి.