ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వేగంగా వరుస ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తూ ప్రజలకు మరింత దగ్గర కావడంతో పాటు భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి ప్రాధాన్యత ఇస్తోంది. 243 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ మరో జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేయడం గమనార్హం. మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని సమాచారం అందుతోంది.
ఈ ఉద్యోగ ఖాళీలలో చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీలు కూడా ఉండగా ఏపీపీఎస్సీ పరీక్ష ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. రీజినల్ మేనేజర్, మహిళా శిశు సంక్షేమ అధికారి, అసిస్టెంట్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీలను కూడా ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది.
ఈ ఉద్యోగ ఖాళీలలో శిశు సంరక్షణ కేంద్రాల సూపరిండెంట్ పోస్టులు 21 ఉండగా గ్రేడ్1 సూపర్ వైజర్ ఉద్యోగ ఖాళీలు 161 ఉన్నాయి. త్వరలో ఈ జాబ్ నోటిఫికేషన్ కు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడి కానుండగా ఈ ఉద్యోగాలకు ఎక్కువ మొత్తం వేతనంగా లభించనుందని సమాచారం అందుతోంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల వల్ల నిరుద్యోగులకు మేలు జరగనుంది.
ఏపీ ప్రభుత్వం రాబోయే రోజుల్లో మరిన్ని భారీ జాబ్ నోటిఫికేషన్ల దిశగా అడుగులు వేస్తోందని తెలుస్తోంది. జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత 4.5 లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడం జరిగింది. ఎక్కువ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తూ జగన్ ప్రజలకు మరింత దగ్గరవుతున్నారు.