AP Liquor Scam: ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం గురించి నిత్యం ఎన్నో రకాల వార్తలు బయటకు వస్తున్నాయి. అయితే ఇది వరకు కొంతమందిని అరెస్టు చేసినప్పటికీ ఇప్పుడు మాత్రం ఈ లిక్కర్ స్కాం మొత్తం వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి చుట్టూ తిరుగుతోంది. వెంకటేష్ నాయుడు అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి కొమ్ముకాస్తూ ఉంటారు అయితే గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డికి ఎంతో సన్నిహితంగా ఉన్న ఈయన ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది అయితే లిక్కర్ స్కామ్ కుంభకోణం విషయంలో వెంకటేష్ నాయుడు కీలక సూత్రధారి అని తెలుస్తుంది.
ఇక ఈ విషయం గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి చెందిన నేత ఆనం వెంకటరమణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనగా మారాయి. ఏపీలో లిక్కర్ స్కామ్ జరుగుతుందని గతం నుంచి నేను పదేపదే చెబుతూ వస్తున్నాను నేను చెప్పిన ఈ విషయం గురించి ఎవరు పెద్దగా పట్టించుకోలేదని ఆనం వెల్లడించారు.
ఈ కుంభకోణంలో సిట్ విచారణ మొదలైనప్పటి నుంచి వినిపిస్తున్నది కథనాలు కాదని వాస్తవాలను ఈయన తెలిపారు. ఈ స్కామ్ లో వైసీపీ నేతలకు ప్రమేయం ఉందని ఈయన కుండబద్దలు కొట్టి చెప్పారు. లిక్కర్ స్కామ్ లో భాగంగా పెద్ద ఎత్తున డబ్బు పోగు చేసుకుని నేతలు అందరూ విమానాలలో జల్సాలు చేసుకుంటూ తిరుగుతున్నారని తెలిపారు. విమానంలో ఒక హీరోయిన్ ఉన్న ఫోటో బయటకు వచ్చింది అయితే వచ్చింది ఒక ఫోటో మాత్రమేనని ఎంతమంది ఇలా హీరోయిన్లు విమానాలలో తిరిగారు ఎన్ని ప్రైవేట్ విమానాలను ఉపయోగించారనే విషయాలపై సిట్ పూర్తిస్థాయిలో దర్యాప్తు జరుపుతుందని వెల్లడించారు. ఇలా మద్యం కుంభకోణం విషయంలో రోజుకు ఒక వార్త వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో ఇది కాస్త సంచలనగా మారింది.
