Y.S.Jagan: ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జెడ్ ప్లస్ సెక్యూరిటీని కల్పిస్తున్నాయని చెప్పినప్పటికీ జగన్ ఏదైనా పర్యటన నిమిత్తం బయటకు వెళ్తే ఆయన చుట్టూ సెక్యూరిటీ దరిదాపుల్లో కూడా కనిపించడం లేదు. దీంతో జగన్ బయటకు వెళ్ళినప్పుడు ఆయనకు భద్రత కరువైందంటూ వైసిపి నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రికి రాష్ట్ర ప్రభుత్వం కనీస భద్రత కల్పించకపోవడం విడ్డూరం అంటూ పలు సందర్భాలలో విమర్శలు కురిపించారు. ఇలా జగన్ మోహన్ రెడ్డికి సరైన భద్రత లేని నేపథ్యంలో జగన్ ప్రైవేట్ సైన్యాన్ని రంగంలోకి దింపారని తెలుస్తోంది.
వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తన భద్రత కోసం ప్రైవేటు సైన్యాన్ని నియమించుకున్నారు. ఏకంగా 40 మంది బౌన్సర్లను ఏర్పాటు చేసుకున్నారు. బుధవారం డోన్ పర్యటన నుంచి వీరు రంగంలోకి దిగనున్నారని వైసీపీ వర్గాలు తెలిపాయి. అయితే ఆయనకు రక్షణ కల్పిస్తున్న పోలీసులు.. ప్రైవేటు సైన్యాన్ని అనుమతిస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. మరి డోన్ పర్యటనలో భాగంగా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పర్యటనకు ఎలాంటి ఆంక్షలు విధిస్తారు ఆయన ప్రైవేట్ సెక్యూరిటీని తనతో వెళ్లడానికి అనుమతి ఇస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.
ఇక జగన్మోహన్ రెడ్డి గతంలో కూడా ఇలా ప్రవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్న సంగతి తెలిసిందే ముఖ్యంగా ఈయన పాదయాత్ర చేస్తున్న సమయంలో ప్రవేట్ సెక్యూరిటీ నియమించుకున్నారు అయితే ఇప్పుడు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలలో భాగంగానే తనకు ఇచ్చిన జడ్ ప్లస్ సెక్యూరిటీ భద్రతను కూడా తగ్గిస్తూ వచ్చారు ఇలా ప్రభుత్వం తనకు కల్పించాల్సిన భద్రత కల్పించని నేపథ్యంలోనే జగన్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని స్పష్టం అవుతుంది.
