ఎల్ఐసి ప్రవేశపెట్టిన ఈ స్కీమ్ తో నెలకు రూ.5.6 లక్షలు పొందే అవకాశం..?

ప్రముఖ భీమా సంస్థలలో ఒకటైన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసి) తమ పాలసీదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త స్కీమ్స్ ని ప్రవేశపెడుతోంది. ఎల్ఐసి ప్రవేశపెడుతున్న ఈ స్కీమ్స్ లో చేరటం వల్ల పాలసీదారులు ఎన్నో బెనిఫిట్స్ ను పొందే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఎల్ఐసి ప్రవేశపెట్టిన యాన్యుటీ ప్లాన్ అయిన ఎల్ఐసీ జీవన్ శాంతి స్కీమ్ వల్ల కూడా పాలసీదారులకు ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పవచ్చు. ఎల్ఐసి జీవన్ శాంతి స్కీమ్ లో లక్షన్నర రూపాయల నుంచి గరిష్టంగా ఎంత మొత్తమైనా డిపాజిట్ చేసే అవకాశం ఉంటుంది.

ఈ జీవన్ శాంతి స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన మొత్తాన్ని అంచలవారీగా అవసరాలకు అనుగుణంగా నెలవారీ పెన్షన్ నుంచి 6 నెలల పెన్షన్ వరకు పొందే అవకాశం ఉంటుంది. ఎల్ఐసి ప్రవేశపెట్టిన ఈ స్కీం లో ఇన్వెస్ట్ చేసే డబ్బును పట్టి ప్రతి నెల వచ్చే పెన్షన్ మొత్తం ఆధారపడి ఉంటుంది. ఈ స్కీమ్ లో 10 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన వాళ్లు నెలకు 5.6 లక్షల పెన్షన్ ను పొందే అవకాశం అయితే ఉంటుంది. అలాగే అంత పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టలేని వారు ఈ స్కీమ్ లో లక్షన్నర రూపాయల వరకూ పెట్టుబడి పెట్టవచ్చు. ఇలా లక్షన్నర రూపాయలు పెట్టుబడి పెట్టిన వారికి నెలకు 1000 రూపాయల కనీస పెన్షన్ లభిస్తుంది.

ఈ స్కీమ్ లో పెట్టుబడి పెట్టిన పాలసీదారులు మరణించిన తరువాత పాలసీదారుడుకు రావలసిన డబ్బు నామినికి చెందుతుంది. ఇక ఈ స్కీం గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి దగ్గర్లోని ఎల్ఐసి ఏజెంట్ లేదా ఎల్ఐసి బ్రాంచ్ ని సంప్రదించవచ్చు. ఇలా
ఎల్ఐసీ కస్టమర్ల ప్రయోజనాలకు అనుగుణంగా పాలసీలను అందిస్తుండగా సరైన పాలసీలను ఎంచుకోవడం ద్వారా ఎక్కువ మొత్తం బెనిఫిట్స్ ను పొందే అవకాశాలు ఉంటాయి. ప్రతి నెలా పెన్షన్ పొందాలని భావించే వాళ్లకు ఈ జీవన్ శాంతి స్కీమ్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.