ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాల్లో విభిన్న పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటే… ఆ పార్టీకి ప్రస్తుతం గార్డియెన్ గా జనసేన అధినేత పవన్ వ్యవహరిస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అలా అని పవన్ కూడా మెచ్యూర్డ్ పొలిటీషియన్ గా రాజకీయాలు ఇప్పటికీ చేయలేకపోతున్నారని అంటున్నారు.
మరోపక్క అధికార వైసీపీ చాపకింద నీరులా తన పని తాను చేసుకుపోతోంది. విపక్షాలు ఇంత వీక్ గా ఉన్నాయి కదా అని ఏమాత్రం అలసత్వం ప్రదర్శించే ఆలోచన ఆ పార్టీ చేయడం లేదు. ఎప్పుడైతే వైనాట్ 175 అనే నినాదాన్ని ఎత్తుకున్నారు.. నాటి నుంచి రకరకాలా వ్యూహాలు, ఎత్తుగడలతో ముందుకు దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో తాజాగా జగన్ మదిలో మరో ఆలోచన ఉందని, అది బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు.
వాస్తవానికి జగన్ తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పటికీ… చెప్పాడంటే చేస్తాడంతే అనే పేరు సంపాదించుకున్నారన్నా అతిశయోక్తి కాదు. కరోనా కష్టకాలంలో జగన్ అమలుపరిచిన సంక్షేమ పథకాలు.. ఎక్కడా ఆగకుండా సాగిన నగదు బదిలీ కార్యక్రమాలూ… జగన్ పై సామాన్యుల్లో నమ్మకం పెంచాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
పైగా… 2014 ఎన్నికల్లో టీడీపీ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలకు, బాబు సర్కార్ అమలుచేసిన నెంబర్ కు ఏమాత్రం పొంతన లేదని, ఆఖరికి మేనిఫెస్టోను కూడా దాచేసిన పరిష్తితి అనే కామెంట్ళు వినిపించిన సంగతి తెలిసిందే.. ఈ నేపథ్యంలో జగన్ సర్కార్ మాత్రం ఇప్పటికే 90శాతానికి పైగా హామీలు అమలు చేసినట్లు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో… జగన్ మదిలో రైతు రుణమాఫీ అనే ఆలోచన వచ్చిందని సమాచారం. అవును… ఈసారి ఎన్నికల ప్రణాళికలో “రైతుల రుణ మాఫీ” అనే హామీని ముందు ఉంచుతారు అని అంటున్నారు. నిజానికి ఈ హామీని చంద్రబాబు 2014 ఎన్నికల్లో ఇచ్చి భారీగా లబ్ది పొందిందనేదీ నిర్వివాదాంశం. ఏపీలో అరవై డెబ్బై లక్షలకు పైగా రైతు కుటుంబాలు ఉండతంతో… వారందరినీ నాడు టీడీపీ ఈ హామీ ద్వారా ఆకట్టుకుంది.
అయితే హామీ ఇచ్చింది, ఎన్నికల్లో ప్రజలను నమ్మించింది, ఫలితంగా లబ్ధి పొందింది కానీ… అధికారంలోకి వచ్చిన తర్వాత నాడు 87 వేల కోట్ల రైతు రుణాల మాఫీ ఉంటే అయిదేళ్లలో కేవలం పాతిక వేల కోట్ల రూపాయలు మాత్రమే మాఫీ చేసింది అని వైసీపీ తీవ్రస్థాయిలో విమర్శిస్తూ ఉంటుంది. తాము మాత్రం అలా కాకుండా ఇచ్చిన మాటకు కట్టుబడి రుణ మాఫీ చేస్తామని చెబుతూనే… గతంలో వైఎస్ జగన్ ఈ హామీ ఇవ్వలేదని గుర్తు చేస్తున్నారు.
దీంతో… జగన్ హామీ ఇస్తే అప్పుచేసైనా నెరవేరుస్తారనే పేరు సంపాదించుకోవడంతో… ఈ రైతు రుణమాఫీ అనే హామీని వైసీపీ తన మ్యానిఫెస్టోలో చేర్చితే, రైతులు కచ్చితంగా నమ్మే అవకాశం ఉందని చెబుతున్నారు. అదే జరిగితే టీడీపీ – జనసేనల పుట్టి మునగడం ఖాయమనే మాటలు వినిపిస్తున్నాయి. రాజకీయాల్లో నమ్మక్కం అంత ముఖ్యం మరి!!