Raja Saab: రాజాసాబ్ టీజర్ రూమర్స్ పై స్పందించిన నిర్మాణ సంస్థ.. అవన్నీ నమ్మకండి అంటూ!

Raja Saab: టాలీవుడ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం రాజాసాబ్. హర్రర్ కామిడీ జానర్ లో ఈ సినిమా తెలుగు ఎక్కుతున్న విషయం తెలిసిందే. ఇంతకు ముందు ఎప్పుడూ కనిపించిన విధంగా ప్రభాస్ ఈ సినిమాలో సరికొత్తగా కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్,పోస్టర్స్ విడుదలైన విషయం తెలిసిందే. మొట్టమొదటిసారి డార్లింగ్ ప్రభాస్ ముసలి పాత్రలో నటిస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. అయితే ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 10వ తేదీన విడుదల చేయబోతున్నట్టు మూవీ మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇక ఈ సినిమా టీజర్ ని మాత్రం ఈ ఏడాది క్రిస్మస్ పండుగకు లేదంటే న్యూ ఇయర్ కి వస్తుందని ఇటీవల వార్తలు జోరుగా వినిపించాయి. అంతేకాకుండా ప్రభాస్ కాలికి గాయం అవ్వడంతో రాజాసాబ్ సినిమా వాయిదా పడబోతోంది అంటూ కూడా వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ వార్తలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టడంతో తాజాగా ఈ రూమర్స్ పై నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ స్పందిస్తూ అధికారికంగా ఒక లెటర్ ని విడుదల చేసింది. ఆ లెటర్ లో.. రాజాసాబ్ షూటింగ్ కంటిన్యూగా రాత్రి, పగలు షెడ్యూల్స్ తో జరుగుతోంది. ఆల్మోస్ట్ 80 శాతం షూటింగ్ పూర్తి అయిపొయింది. అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి.

 

ఇటీవల టీజర్ క్రిస్మస్ కి, న్యూఇయర్ కి వస్తుందని కొన్ని రూమర్స్ వస్తున్నాయి. అలాంటి రూమర్స్ నమ్మకండి. ఎలాంటి అప్డేట్స్ అయినా మేము అధికారికంగా ఇస్తాము. టీజర్ త్వరలోనే వస్తుంది. మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది అని తెలిపారు. దీంతో రాజాసాబ్ టీజర్ ఇప్పట్లో లేనట్టే అని తెలుస్తుంది. వచ్చే సంవత్సరమే ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఆ విషయాలు పక్కన పెడితే ఈ సినిమా అనుకున్న సమయానికి విడుదల అవుతుంది అని మూవీ మేకర్స్ చెప్పకనే చెప్పడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.