Game Changer: గేమ్ ఛేంజర్ మరో సాంగ్ విడుదల.. ప్రోమో రిలీజ్.. ఫుల్ సాంగ్ వచ్చేది అప్పుడే!

Game Changer: టాలీవుడ్ పాన్ ఇండియా హీరో రామ్ చరణ్ హీరోగా నటించిన తాజా చిత్రం గేమ్ చేంజర్. ఈ సినిమాకు తమిళ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎట్టకేలకు ఈ సినిమా విడుదల తేదీని ఫిక్స్ చేశారు మూవీ మేకర్స్. వచ్చే సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 10వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి అవ్వడంతో సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలను మొదలుపెట్టారు మూవీ మేకర్స్. ఇక సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో సినిమా నుంచి ఒక్కొక్క అప్డేట్ ను విడుదల చేస్తూ సినిమాపై అంచనాలను భారీగా పెంచేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే ఈ సినిమా నుంచి మూడు పాటలు టీజర్ విడుదలైన విషయం తెలిసిందే. మూడు పాటలు కూడా యూట్యూబ్ లో సెన్సేషన్ ను క్రియేట్ చేశాయి. తమన్ ఇచ్చిన మ్యూజిక్, శంకర్ మార్క్ విజువల్స్ తో పాటలు అదిరిపోయాయి. ఇది ఇలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా నుంచి నాలుగవ పాటను విడుదల చేయబోతున్నారు మూవీ మేకర్స్.

Dhop - Song Promo | Game Changer | Ram Charan, Kiara Advani | Thaman S | Shankar

ఈ ఫుల్ సాంగ్ ని డిసెంబర్ 22వ తేదీ ఉదయం 8.30 గంటలకు రిలీజ్ చేయనున్నారు. ఈ సాంగ్ చాలా స్టైలిష్ గా ఉంది. ఇక ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాయగా తమన్ సంగీత దర్శకత్వంలో తమన్, రోషిని, పృథ్వీ శృతి రంజని పాడారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవ్వగా ఫ్యాన్స్ ఫుల్ సాంగ్ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సాంగ్ కు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన మూడు పాటలు ఒకదానిని మించి ఒకటి సక్సెస్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు నాలుగో పాట ఎలాంటి సక్సెస్ ను అందుకుంటుందో చూడాలి మరి.