Raghav Omkar Sasidhar: దర్శకుడు రాఘవ్ ఓంకార్ శశిధర్ గురించి మనందరికీ తెలిసిందే. ఈయన ఎక్కువగా ఇండిపెండెంట్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. ఇలాంటి తరహా సినిమాలతో ప్రేక్షకులు అందించడంతోపాటు ఎన్నో అవార్డులను కూడా గెలుచుకున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ది 100 అనే సినిమాతో త్వరలో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నారు ఓంకార్ శశిధర్. అయితే ఈ సినిమాలో హీరోగా నటిస్తోంది మరెవరో కాదు మొగలిరేకులు సీరియల్ ఫేమ్ సాగర్.
మొగలిరేకులు సీరియల్ తో భారీగా ఫేమ్ ని సంపాదించుకున్న సాగర్ ఆ తర్వాత కొన్ని సినిమాలలో నటించిన విషయం తెలిసిందే. కాగా ఈ సినిమాలో సాగర్ విక్రాంత్ అనే ఐపిఎస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, పోస్టర్స్ రిలీజ్ చేసి భారీగా హైప్ క్రియేట్ చేసారు. అయితే ఇక్కడ ఆశ్చర్య పోవాల్సిన విషయం ఏమిటంటే అయితే ది 100 సినిమా రిలీజ్ కి ముందే పలు నేషనల్, ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ లో పాల్గొని అనేక అవార్డులను గెలుచుకుంది. ఈ క్రమంలో దర్శకుడు ఇదంతా తన గురువుగారి వల్లే అంటూ ఒక స్పెషల్ పోస్ట్ తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు. ఈ మేరకు తన పోస్టులో ఈ విధంగా రాసుకొచ్చారు.
నేను దర్శకత్వం వహించిన మొదటి సినిమా ది 100 రిలీజ్ కి ముందే అనేక ప్రతిష్టాత్మక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకుంటుంది. సినిమా చూసిన వాళ్లంతా సినిమా గురించి, ఇందులో క్యారెక్టర్స్ గురించి గొప్పగా మాట్లాడుతున్నారు. ఇంత పర్ఫెక్ట్ గా కథని రాయడం, పాత్రలను రాసుకోవడం అంతా నా గురువు కృష్ణవంశీ గారి దగ్గరే నేర్చుకున్నాను. ఆయన దగ్గర నేర్చుకున్న విలువలు, కథ చెప్పే విధానం నా సక్సెస్ లో కీలక పాత్ర పోషించాయి. ఈ సక్సెస్ ని వందశాతం నా గురువు కృష్ణవంశీ గారికి అంకితం ఇస్తున్నాను. త్వరలోనే ఈ సినిమా మీ అందరి ముందుకు రానుంది. మీ అందరి సపోర్ట్ కావాలి. నన్ను ఇంత బాగా గైడ్ చేసినందుకు మా గురువు గారు కృష్ణవంశీ గారికి ధన్యవాదాలు అంటూ తెలిపాడు రాఘవ్ ఓంకార్ శశిధర్. అయితే విడుదలకు ముందే ఇన్ని అవార్డులను సొంతం చేసుకుంటున్న ఈ సినిమా విడుదల తర్వాత ఇంకెన్ని అవార్డులను కైవసం చేసుకుంటుందో చూడాలి మరి.