Allu Sneha Reddy: అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Allu Sneha Reddy: తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. స్నేహా రెడ్డి గారు కూడా సోషల్ మీడియాలో భారీగా అభిమానులు ఉన్నారు. మిలియన్ల కొద్ది ఫాలోవర్స్ ఉన్నారు. కాగా స్నేహా రెడ్డి ఒకవైపు అల్లుకోడలిగా బాధ్యతలు నిర్వహిస్తూనే కొన్ని బిజినెస్ లలో కూడా సక్సెస్ఫుల్ ఉమెన్ గా రాణిస్తోంది. అలాగే సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంటూ తనకు తన భర్త పిల్లలకు సంబంధించిన విషయాలను ఫోటోలను వీడియోలను పంచుకుంటూ ఉంటుంది స్నేహా రెడ్డి.

ముఖ్యంగా కూతురు అల్లు అర్హ,కొడుకు అల్లు అయాన్లకు సంబంధించిన ఫోటోలు వీడియోలు అల్లరి చేష్టలకు సంబంధించిన వీడియోలను పంచుకుంటూ ఉంటుంది. ఇంస్టాగ్రామ్ లో స్నేహా రెడ్డికి ఏకంగా 9.3 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు. తాజగా స్నేహా రెడ్డి ఆస్తుల విలువ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్నేహారెడ్డి తండ్రి కుటుంబం కూడా బాగా డబ్బు ఉన్న కుటుంబమే అన్న విషయం తెలిసిందే. ఆమె తండ్రి రాజకీయ నేత మాత్రమే కాదు, పలు బిజినెస్ లకు చైర్మన్ గా కూడా ఉన్నారు. సొంతంగా అనేక బిజినెస్ లు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఒక ఇంజనీరింగ్ కాలేజీ కూడా ఉంది.

అయితే ఈ బిజినెస్ లలో ఒక కంపెనీలో స్నేహా రెడ్డి డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారట. అలాగే సోషల్ మీడియా వేదిక ఇప్పటికే పలు బ్రాండ్ లను స్నేహా ప్రమోట్ చేస్తూ భారీగానే డబ్బులు సంపాదిస్తోంది. అలాగే ఇటీవలే పికాబూ అనే ఆన్ లైన్ ఫొటోస్టూడియో సంస్థని కూడా ప్రారంభించి సక్సెస్ ఫుల్ గా నడిపిస్తుంది. అల్లు అర్జున్ కి సంబంధం లేకుండా స్నేహా రెడ్డి మీద కూడా బాగానే ఆస్తులు ఉన్నట్టు తెలుస్తోంది. కేవలం అల్లు స్నేహారెడ్డి నికర ఆస్తులు విలువ దాదాపుగా 42 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. ఇవే కాకుండా ఇంకా చాలా ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వామ్మో స్నేహ రెడ్డికి ఏకంగా అన్ని కోట్ల ఆస్తులు ఉందా అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక భర్త అల్లు అర్జున్ ఆస్తి కొన్ని వందల కోట్లు ఉంటుందని చెప్పవచ్చు.