ఏపీలో ప్రస్తుతం చంద్రబాబు కంటే ఎక్కువగా టీడీపీ అనుకూల మీడియా (వాడుకలో ఎల్లో మీడియా అంటారు) మరెక్కువగా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్లుంది. ఆరు నూరైనా నూరు ఆరైనా ఇప్పటికిప్పుడు అవినాశ్ రెడ్డి అరెస్టయిపోవాలి, ఎన్నికల్లో జగన్ ఓడిపోవాలి.. కడప జిల్లాలో వివేకా హత్య జరిగినందుకు ఏపీలో 26 జిల్లాల ప్రజలు జగన్ ఓడించేసి, (ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచిన) చంద్రబాబుని సీఎంని చేసేయాలి అని పరితపించిపోతుంది! ఇందులో భాగంగా సస్పెండ్ అయిన ప్రొఫెషనల్స్ ని నమ్ముకుని ప్రజలను తప్పుదోవపట్టించే కార్యక్రమానికి తెరలేపింది!
కొన్ని రోజుల క్రితం… “అపరిమిత అప్పులు చేస్తూ, ఆ మొత్తాలను అనుత్పాదకంగా ఖర్చు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ అతి ప్రమాదకర పరిస్థితుల్లో ఉందని చెప్పేందుకు నేను ఏమాత్రం సందేహించడం లేదు. దేశ చరిత్రలో ఎప్పుడూ ఏ రాష్ట్ర ప్రభుత్వమూ ఇలా అప్పులు చేయలేదు” అంటూ ఆర్థిక నిపుణుడు డాక్టర్ జి.వి.రావు చెప్పారంటూ.. ఒకరిని తెరపైకి తెచ్చింది ఆ వర్గం మీడియా. ఆంధ్రప్రదేశ్ త్వరలో పాకిస్థాన్ అయిపోతుంది, శ్రీలంక అయిపోతుందంటూ ఈయనతో చెప్పించింది! తర్వాత ఈయన ఎవరా? అని ఎంక్వైరీ నడించింది!
ఈలోపు జీవీ రావు చెప్పినవన్నీ సత్య దూరాలని, టీడీపీ అనుకూల మీడియా ఇతడిని గొప్ప ఆర్థిక నిపుణుడిగా తెరపైకి తెచ్చి జగన్ పై బురద జల్లించిందని గణాంకాలతో సహా ఎండగట్టారు ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి (ఫైనాన్స్, ఎకనామిక్ అఫైర్స్) దువ్వూరి కృష్ణ! ఈ వివరణతో పాటు “ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్” అంటూ ఆన్ లైన్ ఒక ఆటాడుకున్నారు నెటిజన్లు. కారణం… ఇతడిని ఐసీఏఐ నుంచి సస్పెండ్ చేశారని.. తప్పుడు ఆడిటింగ్ చేసినందుకు ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్నాడని తేలడమే!!
అది అలా బౌన్స్ బ్యాక్ అవ్వడంతో… తాజాగా “అవినాశ్ రెడ్డి కి బెయిల్” వార్తలపై ఒక ఛానల్ లో డిబేట్ జరిగింది. ఈ డిబేట్ లో రామకృష్ణ అనే వ్యక్తి… హైకోర్టు న్యాయమూర్తిపైనే తీవ్రమైన ఆరోపణలు చేశారు. అవినాష్ దగ్గర మూటలు తీసుకునే జడ్జి తాత్కాలిక బెయిల్ ఇచ్చారని ఆరోపించారు. బెయిల్ అప్లికేషన్లోలోని రిలీఫ్ ఇచ్చారంటేనే ఏ జడ్జియినా మూటలు తీసుకునే బెయిల్ ఇచ్చారని తాను కచ్చితంగా చెప్పగలనని రామకృష్ణ చెప్పుకొచ్చారు. దీంతో “ఇతగాడెవరబ్బా” అని వివరాలు తీశారు నెటిజన్లు!
దీంతో… ఏబీఎన్ ఛానల్ డిబేట్ లో ఊకదంపుడుగా హైకోర్టు న్యాయమూర్తులపై విజ్ఞత మరిచి విమర్శలు చేసిన ఇతగాడు.. సస్పెండ్ అయి, కేసులు ఎదుర్కొంటున్న వివాదాస్పద జడ్జి అని తేలింది! ఇలా పనికిమాలిన పనులు చేసి సస్పెండ్ అయిన వారికి సూట్లు వేసి కూర్చోబెట్టి ప్రజలను తప్పుదోవపట్టించేపనికి పూనుకుంటున్నారు ఒక వర్గం మీడియా పెద్దలు! దీంతో… తీవ్ర విమర్శల పాలవుతున్నారు!