వాలంటీర్లపై నోరు జారిన వాళ్లకి జగన్ రిటన్ గిఫ్ట్!

గతకొన్ని రోజులుగా వాలంటీర్లపైనా, ఆ వ్యవస్థపైనా జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ మహిళా నేత వంగలపూడి అనిత మరికొంతమంది నేతలు అవాకులూ చెవాకులూ పేళుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో జగన్ మైకందుకున్నారు.

ఏపీలో వాలంటీర్లపై పవన్ – చంద్రబాబు ఎలాపడితే అలా మాట్లాడుతుంటే… జగన్ ఎందుకు స్పందించడం లేదు.. సరైన యాక్షన్ ఎందుకు తీసుకోవడం లేదు అని సగటు అభిమాని ఫీలవుతూ ఉండేవాడు. ఒంటరి అవుతున్నామా అనే భయం కొంతమంది వాలంటీర్లలో కలిగిందనే కామెంట్లూ వినిపించేవి.

ఈ సమయంలో ఆ భయాలు, ఆ ఫీలింగ్స్ ని పటాపంచలు చేశారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. తాను మొదలుపెడితే ఎలా ఉంటుందో చూపించారు. వాలంటీర్లపై తప్పుడు మాటలు మాట్లాడుతున్న వారి తప్పుడు క్యారెక్టర్ ని ప్రజలముందు ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. క్యారెక్టర్ లేనివాళ్లు తన వాలంటీర్ తమ్ముళ్లు, చెల్లెళ్ల క్యారెక్టర్ ని బ్యాడ్ చేస్తున్నారని ఫైరయ్యారు.

అవును… వాలంటీర్లు రాష్ట్రంలోని ప్రతి గడపకు సేవలందిస్తున్నారు. ఎండ, వాన, చలి, వరదలను లెక్క చేయకుండా పని చేస్తున్నారు. ఒకటో తేదీ వచ్చిందంటే… అది సెలవు రోజైనా, పండగరోజైనా ఉదయాన్నే సూర్యోదయం కంటే ముందే తలుపు తట్టి అవ్వా తాతలకు పెన్షన్ ఇస్తున్నారని జగన్ వాలంటీర్లను కొనియాడారు. అలాంటి అలాంటి వాళ్లపై అన్యాయంగా బురద జల్లుతున్నారని జగన్ స్లోగా మొదలుపెట్టారు.

వాలంటీర్లపై తప్పుడు మాటలకు స్క్రిప్ట్‌ రామోజీరావుది.. నిర్మాత చంద్రబాబైతే.. నటన, మాటలు అన్నీ కూడా దత్తపుత్రుడివే అని మొదలుపెట్టిన జగన్… వాలంటీర్లు స్త్రీలను లోబర్చుకుంటారని, ట్రాఫికింగ్‌ చేస్తున్నారని, మహిళలను ఎక్కడికో పంపిస్తున్నారని నిసిగ్గుగా వ్యాఖ్యానిస్తున్నార ఫైరయ్యారు.

ఈ సందర్భంగా వాలంటీర్లలో 60 శాతం మహిళలే ఉన్నారని గుర్తుచేశారు జగన్. అలాంటి వాలంటీర్లపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారి ఆరోపణలను సిగ్గులేకుండా తాటికాయంత అక్షరాలతో అచ్చేస్తున్నారని మండి పడ్డారు. అలా మెల్లగా డోస్ పెంచిన జగన్… అనంతరం ఎక్సలేటర్ రేజ్ చేసేశారు.

చంద్రబాబు నాయుడు, ఆయన దత్తపుత్రుడు, సొంత పుత్రుడు, బావమర్ది క్యారెక్టర్‌ ఎలాంటిదో అందరినీ తెలుసు అని సీరియస్ గా స్టార్ట్ చేసిన జగన్… యూట్యూబ్ లలో వారి బండారలు కనిపిస్తుంటాయని అన్నారు. ఈ సందర్భంగా ఆ నలుగురి గురించీ ఏకవచనంతో సంబోదిస్తూ… ఉక్కిరిబిక్కిరీ చేసేశారు జగన్.

ఇందులో భాగంగా… అమ్మాయిలను లోబరుచుకునీ పెళ్లి చేసుకుని నాలుగేళ్లవ్వగానే వారిని వదిలేయడం… ఇలా ఒకరిని వివాహం చేసుకుని.. అదేసమయంలో మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకోవడం చేసే వ్యక్తా.. వాలంటీర్ల వ్యక్తిత్వం గురించి మాట్లాడేది..? పదేళ్లుగా చంద్రబాబుకు వాలంటీర్‌ గా పని చేస్తున్న ప్యాకేజీ స్టార్‌ క్యారెక్టర్ ఇది అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు సీఎం జగన్‌.

ఇక మరోవ్యక్తి “పట్టపగలే మందు తాగుతూ పదిమంది అమ్మాయిలతో స్విమ్మింగ్ ఫూల్ లో డ్యాన్సులు చేసేవాడు ఇంకొకడు” అని జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇంకొకరు “అమ్మాయిలు కనిపిస్తే చాలు ముద్దైన పెట్టాలి, లేదా కడుపైనా చేయాలని ఇంకొకడు అంటాడు” అని జగన్ ఏకి పారేశారు.

అనంతరం… “వయసు 75 ఏళ్లు.. అయినా సిగ్గు లేదు.. ఒక టీవీ షోకి వచ్చి.. బావా నువ్వు సినిమాల్లోనే చేశావు నేను నిజజీవితంలోనే చేశాను అంటూ చేసిన వెదవ పనులను గొప్పగా చెప్పుకున్న ముసలాయన ఇంకొకడు” అంటూ జగన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వీళ్ల క్యారెక్టర్ గురించి తెలియాలంటే… యూట్యూబ్ లో దొరుకుతాయి అని జగన్ హింట్ ఇచ్చారు.

దీంతో… జగన్ వాయించడం మొదలుపెడితే ఈ స్థాయిలో ఉంటుందా అంటూ రిలాక్స్ అవుతున్నారంట వాలంటీర్లు. ఇకపై తమపై ఆరోపణలు చేయాలంటే… కచ్చితంగా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని సూచిస్తున్నారు. పైగా… తిరిగి కౌంటర్ ఇవ్వలేని స్థాయిలో జగన్ వాయించేసరికి… ప్రస్తుతం ఆ నలుగురు పరిస్థితీ తేలు కుట్టిన దొంగల మాదిరే ఆనే కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం!