Sandeep Reddy: డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సందీప్ రెడ్డి పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చే సినిమాలు అర్జున్ రెడ్డి, యానిమల్. ఈ సినిమాలు విడుదల అయ్యి ఎంతటి విజయాన్ని సాధించాయో మనందరికీ తెలిసిందే. అలా తన సినిమాలతో సెపరేట్ ఫ్యాన్స్ బేస్ ఏర్పరుచుకున్నారు సందీప్. అర్జున్ రెడ్డి సినిమాతో రౌడీ హీరో విజయ్ దేవరకొండ ను స్టార్ హీరో చేయడంతో పాటు స్టార్డమ్ తెచ్చిపెట్టాడు. ఇక బాలీవుడ్ హీరో రన్బీర్ కపూర్ యానిమల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు అందించారు. యానిమల్ సినిమాతో కపూర్ క్రేజ్ ఒక్కసారిగా మార్చేశారు. ఇప్పుడు ప్రభాస్ హీరోగా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఒక సినిమా తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే.
కొన్ని నెలలుగా వీరిద్దరి కాంబోలో రాబోయే ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాకు స్పిరిట్ అనే టైటిల్ సైతం ఫిక్స్ చేశారు. ఈ క్రమంలో తాజాగా మరో పాన్ ఇండియా స్టార్ హీరోతో సందీప్ రెడ్డి సినిమా బోతున్నారు అనే వార్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఆ పాన్ ఇండియా హీరో మరెవరో కాదు రిషబ్ శెట్టి. కన్నడ స్టార్ హీరో అయిన రిషబ్ శెట్టి గురించి మనందరికీ తెలిసిందే. కాంతార సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమా ముందు వరకు రిషబ్ శెట్టి ఎవరు అన్న విషయం చాలా మందికి తెలియదు. ఈ ఒక్క మూవీతో పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియాను ఏలేస్తున్నాడు రిషబ్ శెట్టి.
ఇది ఇలా ఉంటే తాజాగా రిషబ్ శెట్టి మాట్లాడుతూ.. నాకు యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో కలిసి పనిచేయాలని ఉంది అంటూ తన మనసులోని మాటను బయటపెట్టారు. రానా హోస్ట్ గా వ్యవహరిస్తున్న దీ రానా దగ్గుపాటి షోలో పాల్గొన్న శెట్టి
కోరికను బయటపెట్టాడు. సందీప్ లాగా ఎవరూ ఆలోచించలేరు. ఒకసారి ఆలోచించిన తర్వాత మళ్లీ ఆలోచించలేరని నాకు అనిపిస్తుంది. ఆయన చేసే ఏ సినిమాలోనైనా నటించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను.నాకు చిన్నప్పటి నుంచి ఒక కల ఉండేది. మా గ్రామం కెరడిలో, ఇక్కడి అడవిలో సినిమా షూట్ చేయాలని కలలు కన్నాను. నేను చాలా సినిమాల కోసం ఈ స్థలాన్ని ఉపయోగించాను. కానీ, అది సరిపోవడం లేదు. చివరికి కాంతార సినిమా కథకు ఈ ప్రదేశం సరిపోయింది. గ్రామానికి చెందిన 700 మంది ఈ చిత్రానికి పనిచేశారు అని చెప్పుకొచ్చారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఒకవేళ రిషబ్ శెట్టి, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో సినిమా వస్తే మాత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులో మోత మోగించడం ఖాయం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
