Tollywood 2025: 2024 సంవత్సరం మరి కొద్ది రోజుల్లోనే ముగియనుంది. అయితే ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా కొన్ని సినిమాలు మంచి సక్సెస్ అవ్వగా ఇంకొన్ని సినిమాలు క్లాప్ గా ఇంకొన్ని పూర్తి డిజాస్టర్ గా నిలిచాయి. చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకు చాలా సినిమాలో వచ్చాయి. ఓవరాల్ గా 2024 టాలీవుడ్ కి మంచి బూస్ట్ ఇచ్చిందని చెప్పాలి. ఇక ప్రస్తుతం అభిమానులు చూపు మొత్తం 2025 పై పడింది. ముఖ్యంగా సంక్రాంతి పండుగ తోనే సినిమాల జాతర మొదలుకానుంది. ఏడాది మొదట్లో అందరికంటే ముందుగా బరిలోకి దిగుతున్నాడు మన హీరో రామ్ చరణ్. గేమ్ చేంజెర్ సినిమాతో జనవరి 10వ తేదీన ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ నటించిన సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి.
ఈ సినిమాపై భారీగా హైప్ ఉంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి కూడా విశ్వంభర మూవీ తో వచ్చే ఏడాది ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే సంక్రాంతికి విడుదల కావాల్సి ఉన్నా కొడుకు కోసం సంక్రాంతి బరి నుంచి తప్పుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. దీంతో విశ్వంభర రిలీజ్ సమ్మర్‌కు షిప్ట్ అయ్యింది. ఇక సమ్మర్ లో హరిహర వీరమల్లు సినిమా కాబోతుందని ఇప్పటికే మూవీ మేకర్స్ ప్రకటించారు. సినిమా కాస్త అటు ఇటు అయినప్పటికీ సమ్మర్లో విడుదల కావడం పక్క అని తెలుస్తోంది. ఈ సినిమాపై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. ఇకపోతే 2024లో రెండు బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులకు డబుల్ డోస్ ఇచ్చిన డార్లింగ్ ప్రభాస్ రాజాసాబ్, ఫౌజీ సినిమాలతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధం కాబోతున్నారు. ఈ రెండు సినిమాలు కూడా వచ్చే ఏడాది విడుదల కానున్నట్టు తెలుస్తోంది. 2025లో డబ్బింగ్ సినిమాల జోరు కూడా గట్టిగా కనిపిస్తోంది.
ముఖ్యంగా ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తొలి బాలీవుడ్ మూవీ వార్ 2. హృతిక్‌తో కలిసి నటిస్తున్న ఈ సినిమా మీద సౌత్ లో పాటు నార్త్ లో కూడా భారీగా అంచనాలు ఉన్నాయి. కేజీఎఫ్ లో పాన్ ఇండియా రేంజ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన యష్ ఈ ఏడాది టాక్సిక్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమాల విషయంలో ఆడియన్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. వీటితో పాటుగా ఒక30, 40 కు పైగా చిన్న చిన్న సినిమాలు వెబ్ సిరీస్ లు విడుదల కావడానికి సిద్ధంగా ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే 2025 లో కూడా పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాల జాతర మొదలుకానుంది.