నిర్మాతలకు డబ్బులు మిగిల్చడానికే.. హీరోయిన్ తో రూమ్ షేర్ చేసుకుంటానంటున్న హాలీవుడ్ నటుడు!

స్పైడర్ మాన్ సీరీస్ తో ప్రపంచవ్యాప్తంగా తనకంటూ పేరు తెచ్చుకున్న నటుడు టామ్ హలెండ్. హాలీవుడ్లో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న ఈ నటుడితో సినిమాలు తీయటానికి పెద్ద పెద్ద నిర్మాతలు క్యూ కడుతూ ఉంటారు. ప్రస్తుతం ఈ స్టార్ నటుడు ఆస్కార్ అవార్డు గ్రహీత అయిన క్రిస్టోఫర్ నోలిన్ డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలని పంచుకున్నాడు.

సినిమా సెట్ లో జెండయా తో కలిసి పనిచేయటం ఎలా ఉంటుందో హాలండ్ వెల్లడించాడు. హాలీవుడ్ బ్యూటీ జెండయా గురించి ప్రత్యేకంగా చెప్పాలిన పనిలేదు. స్పైడర్ మ్యాన్ సిరీస్ లో ఈ చిన్నది టామ్ హాలండ్‌తో కలిసి నటించింది. ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరూ కలిసి నటించనున్నారు. అందుకే హాలెండ్ ఆమె గురించి మాట్లాడుతూ జెండయాతో కలిసి పనిచేయడం తనకు పెద్ద ప్లస్ అన్నాడు.

నేను తనతో కలిసి రూమ్ షేర్ చేసుకోవడానికి ఇష్టపడతాను అని చెప్పాడు. ఇది నిర్మాతలకి డబ్బులు మిగిల్చడానికి అంటూ నవ్వేశాడు. అయితే టామ్ ప్రతి హీరోయిన్ తోనే రూమ్ షేర్ చేసుకోడు కేవలం జెండయా తో మాత్రమే షేర్ చేసుకుంటాడు. వీరిద్దరినీ కలిపి సినిమాలో బుక్ చేసుకుంటే నిర్మాతలకి ఎకామిడేషన్ ఖర్చులు మిగులుతాయని హాలీవుడ్లో సెటైర్స్ వినిపిస్తూ ఉంటాయి.

నిజానికి టామ్, జెండయా ఇద్దరూ 2016 నుంచి డేటింగ్ చేస్తున్నారని వార్తలు వినిపించేవి. అయితే మొదట్లో వాళ్ళిద్దరూ దీని గురించి పెద్దగా స్పందించలేదు కానీ 2021లో వారిద్దరూ కారులో ముద్దు పెట్టుకుంటున్న సీన్ ఒకటి వైరల్ అయింది దాంతో వాళ్ళ రిలేషన్ కూడా బయటపడింది. అయితే ప్రస్తుతం వాళ్ళిద్దరూ బ్యాక్ టు బ్యాక్ 2 సినిమాలలో కలిసి నటించబోతున్నారు. ఈ విషయంపై జెండయా మాట్లాడుతూ అతనితో కలిసి నటించడం నాకు సురక్షితంగానూ, ఇష్టంగానూ ఉంటుంది అని చెప్పుకొచ్చింది.