YS Jagan: వైయస్ జగన్మోహన్ రెడ్డి అతని ప్రభుత్వం ఇటీవల కేంద్ర మంత్రి అమిత్ షా అంబేద్కర్ గురించి చేసిన వ్యాఖ్యలకు పూర్తిస్థాయిలో మద్దతు తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇటీవల లోక్ సభలో కేంద్రం హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. ఏంటి
అంబేడ్కర్ అంబేడ్కర్ అని స్మరిస్తారుని కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ఎన్డీయే పక్షాలు మినహా కాంగ్రెస్ పార్టీతోసహా అన్ని ప్రతిపక్ష పార్టీలు ఈ విషయాన్ని తప్పు పడుతూ కేంద్ర మంత్రిపై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే అమిత్ షా వ్యాఖ్యలను పూర్తిగా తప్పుపట్టారు. అయితే తాజాగా ఈ విషయంపై వైకాపా పార్టీ స్పందిస్తూ.. ఈ విషయంలో అమిత్ షా తప్పు లేదనే విధంగా ఆయనకు మద్దతు తెలియజేస్తూ పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా వైకాపా స్పందిస్తూ..వాళ్లు అంబేద్కర్ పేరును వందసార్లు అంటారు.. అన్నిసార్లు దేవుడ్ని పేరు తలుచుకుంటే పుణ్యం వస్తుందన్నట్టుగా అమిత్ షా మాట్లాడిన మాటలు అపోహలకు దారితీశాయి. కానీ.. ఆ తర్వాత ఆయన అంబేద్కర్ గురించి కొనసాగిస్తూ ఆయన అన్న మాటలు.. బీజేపీ సభ్యులు మాట్లాడిన మాటలు, ప్రధాని మోదీగారు మాట్లాడిన మాటలు.. గమనిస్తే అందరూ అంబేద్కర్‌గారిని గౌరవిస్తూ కొనియాడడం మంచి పరిణామం అంటూ ట్వీట్ చేశారు.
ఇలా అమిత్ షాకు మద్దతుగా వైకాపా నిలవడంతో ఈ వ్యాఖ్యలను పలువురు తప్పు పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయన అధికారంలో లేనప్పుడు కూడా ఇలా నరేంద్ర మోడీని, అమిత్ షాని పొగడటమే పనికి పెట్టుకున్నారని పలువురు విమర్శలు కురిపిస్తున్నారు. అంబేద్కర్‌ను ఎవరైనా ఉద్దేశపూర్వకంగా కించపరిచినా.. పల్లెత్తు మాట అన్నా అది తప్పే. పేదవాడికి సమాన హక్కులు, గౌరవం ఉండాలనే అంబేద్కర్ భావజాలం మాకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమే ఆస్పూర్తి కారణంగానే విజయవాడలో అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా వైకాపా నాయకులు గుర్తు చేశారు.
“వాళ్లు అంబేద్కర్ పేరును వందసార్లు అంటారు.. అన్నిసార్లు దేవుడ్ని పేరు తలుచుకుంటే పుణ్యం వస్తుందన్నట్టుగా’’ అమిత్ షా మాట్లాడిన మాటలు అపోహలకు దారితీశాయి. కాని, ఆ తర్వాత ఆయన అంబేద్కర్గారి గురించి కొనసాగిస్తూ ఆయన అన్న మాటలు, బీజేపీ సభ్యులు మాట్లాడిన మాటలు, ప్రధాని మోదీగారు… pic.twitter.com/ln8KO1qwg2
— YSR Congress Party (@YSRCParty) December 19, 2024
