Varun Dhawan: బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ గురించి మనందరికీ తెలిసిందే. వరుణ్ తాజాగా నటించిన చిత్రం బేబీ జాన్. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా క్రిస్మస్ పండుగ కానుకగా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా మూవీ మేకర్స్ ప్రస్తుతం ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు. అందులో భాగంగానే తాజాగా పాడ్ కాస్ట్ లో పాల్గొన్నారు వరుణ్ దావన్. ఈ నేపథ్యంలో తన సినిమాలోని కో స్టార్స్ గురించి పలు ఆసక్తికర వాఖ్యలు చేసారు. ముఖ్యంగా హీరోయిన్ అనుష్క శర్మ గురించి మాట్లాడుతూ..
2018 లో విడుదలైన సుయి ధాగా కోసం అనుష్కతో కలిసి నటించాను. ఆ తర్వాత మేమిద్దరం మంచి స్నేహితులు అయ్యాం. చిత్రీకరణ సమయంలో ఎన్నో విషయాల గురించి మేమిద్దరం మాట్లాడుకునే వాళ్లం. తను ఎంతో మంచి వ్యక్తి. నిజాయితీగా ఉంటుంది. అనుకున్న విషయాన్ని నిస్సం కోచంగా బయట పెడుతుంది. దానివల్ల ఎదుటి వ్యక్తులు కొన్ని సార్లు ఇబ్బంది పడతారు. అన్యాయాన్ని అస్సలు సహించదు. సాధారణంగా ఆమెను చూసి బయటి వారు ఒక ఉద్దేశానికి వచ్చేస్తారు. నిజం చెప్పాలంటే ఆమె గురించి ఎవరికీ ఏమీ తెలియదు. ఈ ప్రపంచం తన గురించి తెలుసుకుంటుందా? లేదా? అనే విషయాన్ని ఆమె అస్సలు పట్టించుకోదు.
విరాట్ కోహ్లీ గురించి ఆమె అప్పుడప్పుడు చెబుతుంటుంది. ఆయన చాలా సెన్సిటివ్ అని, సంప్రదాయ బద్ధమైన వ్యక్తి అని ఆమె . నాటింగ్ హామ్ టెస్టు మ్యాచ్ లో భారత్ ఓడిపోవడంతో ఆయన రూమ్ లో కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్నారని నాతో చెప్పింది. ఆ రోజు మ్యాచ్ లో ఆయన మంచి స్కోర్ చేసినప్పటికీ ఓటమి విషయంలో తనని తానే నిందించుకున్నారని అనుష్క తెలిపింది అని వరుణ్ ధావన్ తెలిపారు. ఈ సందర్భంగా వరుణ్ ధావన్ చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.