Rajamouli: ఏంటి జక్కన్న ఇది మహేష్ ఫ్యాన్స్ టెన్షన్ అర్థం కావడం లేదా.. మళ్ళీ తప్పించుకున్నారుగా!

Rajamouli: ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న పేర్లలో రాజమౌళి పేరు కూడా ఒకటి. ఇటీవల కాలంలో తరచూ ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు రాజమౌళి. పార్టీలకు అటెండ్ అవ్వడం ఫుల్ గా డాన్సులు చేయడం విషయంలోనే కాకుండా ఆర్ఆర్ఆర్ డాక్యుమెంటరీ విషయంలో కూడా వార్తల నిలుస్తూ వస్తున్నారు. అలాగే మహేష్ బాబు తెరకెక్కించబోయే సినిమాకు సంబంధించిన పనుల్లో భాగంగా కూడా బిజీగా ఉన్నారు రాజమౌళి. ఈ నేపథ్యంలోనే రాజమౌళి పై కాస్త గుర్రుగా ఉన్నారు మహేష్ అభిమానులు. మాకు అప్‌డేట్ ఇవ్వమని అంటుంటే మీరు మాత్రం పెళ్లిలో ఇలా డాన్స్ లు చేస్తూ ఎంజాయ్ చేస్తారా అంటూ ఆట పట్టిస్తున్నారు మహేష్ ఫ్యాన్స్.

ఈ విషయంలో మహేష్ బాబు అభిమానులు రిక్వెస్ట్ చేస్తూ జక్కన్న పై కాస్త సీరియస్ అవుతుండగా ఇలాంటి సమయంలోనే తప్పించుకోవడం కోసం జక్కన్న మళ్లీ తన ఐడియాలు మొదలుపెట్టారు. కరెక్ట్ సమయం చూసి ఇప్పుడు ఆర్ఆర్ఆర్ డాక్యుమెంటరీ ట్రైలర్ విడుదల చేసారు జక్కన్న. ఒకవైపు మహేష్ ఫ్యాన్స్ టెన్షన్ పడుతుండగా ఇలాంటి సమయంలో తప్పించుకోవడం కోసం ఈ డాక్యుమెంటరీని అడ్డు పెట్టుకున్నారు. ఈ విషయంలో మాత్రం ఫాన్స్ నుంచి తప్పించుకోవడం ఎలా అనే జక్కన్నతో రాయించాలి. ఈ సూత్రం రాజమౌళికి తెలిసినట్లు మరెవ్వరికి తెలియదు. తాజాగా ఇదే మాయ చేస్తున్నారు జక్కన్న.

కొత్త అప్‌డేట్ చెప్పకుండా ఆర్ఆర్ఆర్‌ తో ట్రెండ్ అవుతున్నారు. ఏ హీరో అప్‌డేట్ అయినా నెల రోజులు ఆలస్యమైతేనే దర్శకులు తెగ కంగారు పడుతుంటారు. కానీ జక్కన్న ఏ అప్‌డేట్ ఇవ్వకుండానే ఏళ్లకేళ్లు సర్వైవ్ అవుతున్నారు. మరోవైపు మహేష్ ఫ్యాన్స్ లో టెన్షన్ మొదలయ్యింది. ఇలాంటి సమయంలోనే ఫ్యాన్స్ ని కూల్ చేయడం కోసం ప్రొడక్షన్స్ తో బిజీగా ఉంటూనే మరోవైపు పర్సనల్ పనులు చేసుకుంటున్నారు రాజమౌళి. కానీ మొత్తంగా చూసుకుంటే మహేష్ అభిమానులకు జక్కన్న వచ్చే ఏడాదిలోనే తీపి కబురు చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. ఇక జక్కన్న స్పందించే వరకు మహేష్ అభిమానులకు నిరాశ ఎదురుచూపులు తప్పవు మరి.