Balakrishna: గన్ తో కాల్చుకొని బాలకృష్ణ సూసైడ్ చేసుకునేవారు… సంచలన విషయాలను బయటపెట్టిన డాక్టర్!

Balakrishna: నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం సినిమాల పరంగా అదే విధంగా రాజకీయాలలో కూడా ఎంతో బిజీగా ఉంటూ మంచి సక్సెస్ అందుకున్నారు. ఒకవైపు వరుస సినిమాలలో నటిస్తూ బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాలను తన ఖాతాలు వేసుకుంటున్న బాలకృష్ణ మరోవైపు రాజకీయాల పరంగా కూడా దూసుకుపోతున్నారు. ఇప్పటికే ఈయన మూడు సార్లు హిందూపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది రాజకీయాలలో కూడా తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు.

ఇక బాలకృష్ణ మనసు ఎంత మంచిదో కోపం వస్తే అదే స్థాయిలో తన ఉగ్రరూపం చూపిస్తారని సంగతి మనకు తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా బాలకృష్ణ వ్యక్తిత్వం గురించి ప్రముఖ డాక్టర్ కాకర్ల సుబ్బారావు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అయితే ప్రస్తుతం ఈయన మరణించినప్పటికీ గతంలో ఈయన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో పాల్గొని బాలకృష్ణ గురించి సంచలన విషయాలను బయటపెట్టారు. అయితే తాజాగా ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా సుబ్బారావు మాట్లాడుతూ గతంలో బాలకృష్ణ బెల్లంకొండ సురేష్ మధ్య జరిగిన తుపాకీ కాల్పల ఘటన గురించి మాట్లాడారు. ఆరోజు కనక బాలకృష్ణ తుపాకీని పేల్చకపోతే అదే రోజు రాత్రి ఆ తుపాకీతోనే ఆయన కాల్చుకొని సూసైడ్ చేసుకునేవారు అంటూ సంచలన విషయాలను బయటపెట్టారు. నా మనసులో ఏదో విధంగా తనని కాపాడాలని అనుకున్నా.. అందువల్ల ఇద్దరు అనుభవం ఉన్న సైకియాట్రిస్టులను పిలిపించి చూడమన్నా.. అతను ఆ విధంగా చేసి ఉండకపోతే తనని తాను కాల్చుకునేవాడని.. అందుకోసమే ఆ టైంలో అలా చేయాల్సి వచ్చిందని కాకర్ల ఈ ఇంటర్వ్యూ సందర్భంగా బయటపెట్టారు. దీంతో ఈ కామెంట్స్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.