Nani: ఎవరేం పీకలేరు… సంచలన వ్యాఖ్యలు చేసిన నాని… వారి గురించే కామెంట్స్ చేశారా?

Nani: నాచురల్ స్టార్ నాని కొన్ని సందర్భాలలో మాట్లాడే విధానం ఆయన సోషల్ మీడియా వేదికగా చేసే పోస్టుల కారణంగా వివాదాలలో నిలుస్తూ ఉంటారు. అయితే ఇటీవల కాలంలో ఈ వివాదాలకు కాస్త దూరంగా ఉన్నటువంటి నాని పూర్తిస్థాయిలో కెరియర్ పై దృష్టి సారించారు ఈ క్రమంలోనే వరుస సినిమాలు చేయడమే కాకుండా నిర్మాతగా కూడా సినిమాలను నిర్మిస్తూ కెరియర్ పట్ల బిజీగా ఉన్నారు.

ఇక ఈయన చివరిగా సరిపోదా శనివారం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ అందుకున్నారు. ఇదిలా ఉండగా తాజాగా నాని సరిగమప ది నెక్స్ట్ సింగింగ్ యూత్ ఐకాన్ షో గెస్ట్ గా వెళ్లారు. సరిపోదా శనివారం అనే స్పెషల్ పేరుతో ఈ ఎపిసోడ్ నిర్వహిస్తున్నారు మేకర్స్ . ఇందుకు సంబంధించిన ప్రోమో వీడియోని కూడా విడుదల చేశారు ఈ కార్యక్రమంలో నాని ఎప్పటిలాగే సరదాగా మాట్లాడుతూ సందడి చేశారు.

ఇక ఈ కార్యక్రమానికి నానితో పాటు హీరోయిన్ ప్రియాంక మోహన్ కూడా సందడి చేసింది. తనదైన స్టైల్ లో అందరిని సందడి చేశారు. ఇక ప్రస్తుతం ఏఐ టెక్నాలజీ ఎంతో మంచి అభివృద్ధి చెందింది. ఏఐ వచ్చేస్తుంది మ్యూజిక్ లోకి అంటూ ఫ్యూచర్ ఏంటి సింగర్స్ కి .. అలా డిస్కషన్ జరిగింది .అప్పుడు నాని ఈరోజు ఇక్కడ కూర్చుని వాళ్ళు పాడుతున్నది చూస్తూ ఉంటే.. ఏఐ ఏం పీకలేదు అని చెప్పాడు.

ఇలా ఏఐ వచ్చిన ఏం పీకలేదు అంటూ సింగర్స్ ను ఉద్దేశించి ఈయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అయితే నాని ఈ వ్యాఖ్యలను చాలా సరదాగా చేసినప్పటికీ మాత్రం సోషల్ మీడియాలో నాని చేసిన ఈ కామెంట్స్ కాస్త వైరల్ అవుతున్నాయి. ఇక నాని కెరియర్ పరంగా ప్రస్తుతం రెండు బడా ప్రాజెక్టులతో ఎంతో బిజీగా గడుపుతున్నారు.