Rashmika: పుష్పలో ఆ సీన్ చేయడానికి రష్మిక విజయ్ దేవరకొండకు ఫోన్ చేసిందా.. ఏం జరిగిందంటే?

Rashmika రష్మిక మందన్న తాజాగా పుష్ప 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇక ఈ సినిమా ద్వారా ఈమె పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హిట్ సొంతం చేసుకున్న రష్మిక అనంతరం బాలీవుడ్ సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా బిజీ అయ్యారు.

ఇలా వరుస పాన్ ఇండియా సినిమాలు బాలీవుడ్ సినిమాలు అంటూ ఎంతో బిజీగా గడుపుతున్న రష్మిక పుష్ప 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు.. ఇకపోతే ఈ సినిమాలో అల్లు అర్జున్ తో కలిసి ఈమె నటన ఎంతో అద్భుతం అని చెప్పాలి. ఇక కొన్ని సన్నివేశాలలో వీరు ఇద్దరు ఎంతో రొమాంటిక్ గా కనిపించారు. అలాగే ఫీలింగ్స్ సాంగులో కూడా రష్మిక అల్లు అర్జున్ బోల్డ్ ఫర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పాలి.

ఇకపోతే ఈ సినిమాకి సంబంధించి ఒక వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ సినిమాలో ఒక సన్నివేశంలో నటించడం కోసం రష్మిక ఎంతో కంగారు పడ్డారని ఆ సమయంలో ఈమె విజయ్ దేవరకొండకు ఫోన్ చేసి మరి ఏడ్చినట్టు తెలుస్తుంది. కీలక సన్నివేశం విషయంలో తనకి అంత క్లారిటీ లేని సమయంలో విజయ్‌కి కాల్ చేసిందట. దీంతో ఆమెకి విజయ్ మంచి సూచనలు ఇచ్చాడని , ఆ తర్వాత ఆమె చేసిన ఆ సీన్‌కి మంచి రెస్పాన్స్ వచ్చిందట.

ఇలా ఈ వార్త వైరల్ గా మారడంతో అంతలా విజయ్ మోటివేట్ చేసే సీన్ ఈ సినిమాలో ఏముందా అని నెటిజన్స్ అనుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే పార్ట్ 1లోనే అల్లు అర్జున్ తో కలిపి ఎన్నో సాలిడ్ ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. మరి పుష్ప 2లో అలాంటి సీన్స్ పెద్దగా లేవు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.