Allu Arjun: అల్లు అర్జున్ పాదాలకు నమస్కరించిన ఆస్కార్ అవార్డు విన్నర్ భార్య… ఏమైందంటే?

Allu Arjun: అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ జాతర సీన్ లో ఎంతో అద్భుతంగా నటించారు. ఈ సన్నివేశం చూస్తే కనుక ఎవరికైనా గూస్ బంప్స్ రావడం ఖాయం అంత అద్భుతంగా అల్లు అర్జున్ నటించారు. అల్లు అర్జున్ నటనకు గాను ఎంతో మంది సినీ సెలబ్రిటీల ప్రశంసల వర్షం కురిపించారు.

ఇక ఈ జాతర సన్నివేశం చూడటం కోసమే ఎంతోమంది థియేటర్ కి వెళ్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సన్నివేశంలో అల్లు అర్జున్ ఎంతో అద్భుతంగా నటించారు సాక్షాత్తు అమ్మవారే ఇలా ఆయన చేత నటించేలా చేసారు అనడంలో అతిశయోక్తి లేదు. థియేటర్లో ఈ సన్నివేశం చూస్తూ ఎంతోమంది పూనకాలతో ఊగిపోయిన సంగతి తెలిసిందే. అయితే అల్లు అర్జున్ ఈ సన్నివేశంలో నటించిన తీరును చూసిన ఆస్కార్ అవార్డు విన్నర్ భార్య ఏకంగా అల్లు అర్జున్ పాదాలపై పడి నమస్కరించారు.

మరి అల్లు అర్జున్ పాదాలపై పడి నమస్కరించిన ఆ ఆస్కార్ అవార్డు విన్నర్ భార్య ఎవరు అనే విషయాన్నికొస్తే ఆమె మరి ఎవరో కాదు ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్ భార్య అని చెప్పాలి.
సినీ గేయ రచయితగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న చంద్రబోస్ నాటు నాటు పాటకు గాను ఆస్కార్ అవార్డు అందుకున్నారు అయితే తాజాగా ఈయన భార్య సుచిత్ర పుష్ప 2 సినిమా చూశారని తెలుస్తుంది.

ఇలా ఈ సినిమా చూసిన అనంతరం ఈమె అల్లు అర్జున్ ని కలిసారట. ఇలా అల్లు అర్జున్ చూడగానే ఒకేసారి ఈమె అల్లు అర్జున్ పాదాల వద్ద మోకాళ్ళపై పడి ఆయనకు నమస్కరించారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన భర్త ఒక ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి..ఆయన ప్రతిభకు ఆస్కార్ కూడా వచ్చింది.అలాంటి వ్యక్తి భార్య ఇలా అల్లు అర్జున్ ముందు మోకాళ్ళ మీద పడి దండం పెట్టడం అంటే ఆయన సాధించిన ఘనత ఈ ఘటన ముందు తేలిపోవాల్సిందే. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.