కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ స్కీమ్స్ లో మెజారిటీ పథకాలు సామాన్యులు, మధ్యతరగతి వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తున్నాయి. కేంద్రం అమలు చేస్తున్న అదిరిపోయే స్కీమ్స్ లో మేరా బిల్ మేరా అధికార్ స్కీమ్ కూడా ఒకటి. వినియోగదారులు విక్రేతల నుంచి కొనుగోలు చేసిన సమయంలో రశీదు తీసుకోవడం ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ స్కీమ్ అమలవుతోంది.
ఈ స్కీమ్ లో భాగంగా ప్రతి 3 నెలలకు ఒకసారి లక్కీ డ్రా నిర్వహించి కోటి రూపాయల చొప్పున రెండు బంపర్ బహుమతులను ఇవ్వడం జరుగుతుంది. పైలట్ ప్రాజెక్ట్ లో భాగంగా ఈ కార్యక్రమం మొదలైంది. ప్రతి నెలా లక్కీ డ్రాలో భాగంగా 800 రశీదులను ఎంపిక చేయడం జరుగుతుంది. లక్కీ డ్రాలో భాగంగా భారీ బహుమతులతో పాటు తక్కువ మొత్తం ఉన్న బహుమతులను సైతం ఇవ్వడం జరుగుతుంది.
నెలలో 5వ తేదీ వరకు అప్ లోడ్ చేసిన రశీదుల ఆధారంగా ఈ ప్రక్రియ జరుగుతుంది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈ స్కీమ్ అమలవుతోంది. కేంద్రం అమలు చేస్తున్న ఈ స్కీమ్ పై ప్రశంసలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఈ స్కీమ్ అమలు ద్వారా పన్ను మోసాలను తగ్గించడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు. కనీసం 200 రూపాయల విలువైన బిల్లు ఉంటే మాత్రమే ఈ స్కీమ్ బెనిఫిట్స్ పొందవచ్చు.
ప్లే స్టోర్ ద్వారా మేరా బిల్ మేరా అధికార్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. web.merabill.gst.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ బిల్లులను అప్ లోడ్ చేసుకోవచ్చు. ఒక వ్యక్తి 25 బిల్లులను గరిష్టంగా అప్ లోడ్ చేయవచ్చు.