RGV: ప్రముఖ సంచలనాత్మక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గత కొద్ది రోజులుగా వరుస వివాదాలలో నిలుస్తున్న విషయం తెలిసిందే. ఈయన వైసీపీ హయాంలో కూటమి నేతలను ఉద్దేశించే సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టులపై ప్రస్తుతం కేసులు నమోదు కావడంతో తనపై నమోదైన కేసుల గురించి సెటైరికల్ పోస్టులు చేస్తూ వార్తల్లో నిలిచారు. అయితే తనపై కేసు నమోదు అయినప్పటికీ వర్మ ఏమాత్రం భయపడకుండా పోలీసులకు వరుస ప్రశ్నలు వేస్తూ పోస్టులు చేశారు.
ఇలా తనపై కేసులు నమోదు కావడంతో రాంగోపాల్ వర్మ ముందస్తు బెయిల్ కూడా తెచ్చుకున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల అల్లు అర్జున్ అరెస్ట్ కావడంతో అల్లు అర్జున్ కి మద్దతుగా సినిమా సెలబ్రిటీలందరూ నిలబడటమే కాకుండా ఆయనని అరెస్టు చేయడానికి పూర్తిగా ఖండించారు ఇక ఈ విషయంపై రాంగోపాల్ వర్మ ఇప్పటికీ కూడా నిత్యం సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.
ఇకపోతే తాజాగా ఈయన మరొక సంచలనమైన పోస్ట్ చేశారు. అల్లు అర్జున్ అరెస్టులు సినిమా ఇండస్ట్రీ మొత్తం తీవ్రంగా ఖండించాలని తెలియజేశారు. ఒక సినిమా సెలబ్రిటీ అయిన రాజకీయ నాయకులైన పాపులర్ కావడం వారి తప్ప అంటూ ప్రశ్నించారు. అలాగైతే క్షణం క్షణం సినిమా షూటింగ్ సమయంలో శ్రీదేవిని చూడటానికి కొన్ని వేల మంది అభిమానులు తరలివచ్చారు.
ఇలా వేల మంది అభిమానులు రావడంతో తొక్కిసలాటలో భాగంగా ముగ్గురు అభిమానులు చనిపోయారు. ఇలా ఆ ముగ్గురు చనిపోవడంతో ఇప్పుడు పోలీసులు స్వర్గానికి వెళ్లి శ్రీదేవిని అరెస్టు చేస్తారా అంటూ ఈయన ప్రశ్నించారు. ఇలా అల్లు అర్జున్ అరెస్టును ఉద్దేశించి ఈయన శ్రీదేవి అరెస్ట్ ప్రస్తావనకు తీసుకురావడంతో ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈయన ట్వీట్ పై నేటిజన్స్ కూడా విభిన్న రకాలుగా స్పందిస్తున్నారు..