Sai pallavi: సినీనటి సాయి పల్లవి ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఈమె కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలకి కమిట్ అవుతూ ప్రతి ఒక్క సినిమా ద్వారా మంచి సక్సెస్ తన ఖాతాలో వేసుకున్నారు. సాయి పల్లవి సినిమాలలో కూడా చాలా పద్ధతిగా కనిపిస్తారు. ఎలాంటి గ్లామర్ షోలకు తావు లేకుండా ఎంతో సహజసిద్ధంగా నటిస్తూ ఆ పాత్రకు పూర్తి స్థాయిలో ప్రాణం పోస్తారు. ఇలా ఎన్నో అద్భుతమైన పాత్రలలో నటించిన సాయి పల్లవి ఇప్పటికే ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు.
ఇకపోతే తాజాగా ఈమె ఖాతాలో మరో అవార్డు వచ్చి చేరిందని తెలుస్తోంది. తమిళ చిత్ర పరిశ్రమలో నిర్వహించే చెన్నై ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ వేడుక ఎంతో ఘనంగా జరిగింది. అయితే ఈ అవార్డు వేడుకలో భాగంగా సాయి పల్లవి ఉత్తమ నటిగా అవార్డును సొంతం చేసుకున్నారు. ఉత్తమ నటుడిగా విజయ్ సేతుపతి అవార్డు అందుకున్నారు మహారాజ సినిమాలో ఈయన నటనకు గాను ఈ అవార్డు అనుకున్నారు.
ఇక సాయి పల్లవి నటించి ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన అమరన్ సినిమాకు గాను ఈమె ఉత్తమ నటిగా అవార్డును సొంతం చేసుకున్నారు. ఇక ఈ అవార్డు వేడుకలో భాగంగా సాయిపల్లవి మాట్లాడుతూ 22వ చెన్నై ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ వేడుకలో ఈ అవార్డు అందుకోవడం తనకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. అలాగే చాలా గర్వంగా కూడా ఉంది ఎందుకంటే ఈ ఏడాది ఎన్నో గొప్ప సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
ఇలా అవన్నీ కాదని నాకు ఈ అవార్డు అందజేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ముఖ్యంగా నా అభిమానులకు ముకుందన్ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు ముకుందన్ భార్య ఇందు వల్లే ఇది సాధ్యమైందని ఈ కథను ప్రపంచానికి తెలియచేయడం కోసం వారు అనుమతి ఇవ్వటం వల్లే ఇది సాధ్యమైంది అంటూ ఈ సందర్భంగా సాయి పల్లవి ఎమోషనల్ అయ్యారు.