ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని మ్మీరు ఏది బడితే అది మాట్లాడతారని బాయట టాక్… పవన్ కల్యాణ్ సినిమాలో డైలాగ్ ఇది. అది టాక్ అయితే పర్లేదు, డైరెక్ట్ ప్రెస్ మీట్ పెట్టి కెమెరాల ముందు సృహ కోల్పోయి మాట్లాడితే ఫలితం ఎలా ఉంటుందో టీడీపీ నేతలకు తెలిసొస్తుంది. ఇదే సమయంలో మనోడే కదా అని వెనకా ముందూ చూడకుండా వెనకేసుకొస్తే ఎఫెక్ట్ ఏ రేంజ్ లో ఉంటుంది ఆ పార్టీ పెద్దలకూ అవగతం అవుతుంది
టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణ మూర్తి… మంత్రి రోజాపై అవాకులూ చెవాకులూ పేలిన సంగతి తెలిసిందే. రాయడానికి వీలులేని మాటలు మాట్లాడారు బండారు. దీంతో యావత్ మహిళా లోకం దుమ్మెత్తి పోసిందనే కామెంట్లు వినిపించాయి. ఈ నేపథ్యంలో రోజాకు రోజు రోజుకీ ఇండస్ట్రీ జనాల నుంచి మద్దతు పెరుగుగుతుంది. దీంతో టీడీపీకి ఇదో కొత్త సమస్యలా మారేలా ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
అవును… మంత్రి రోజాపై బండారు సత్యనారాయణ చేసిన అనుచిత, నిస్సిగ్గు వ్యాఖ్యల వ్యవహారం పొలిటికల్ హాట్ టాపిక్ గానే ఉంది. ఆ కేసులో బండారుని పోలీసులు అరెస్ట్ చేయడం, ఆయన బెయిల్ పై బయటకు రావడం అంతా చకచకా జరిగిపోయినప్పటికీ… ఆ వ్యాఖ్యల తాలూపూ సామాజిక ప్రతిస్పందనలు మాత్రం రోజు రోజుకీ పెరుగుతున్నట్లే కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగా… సినీ ఇండస్ట్రీ నుంచి మంత్రి రోజాకి పెద్ద ఎత్తున మద్దతు వస్తోంది.
రాజకీయాల్లో ఉన్న సినీతారలు ముందుగా రోజాపై బండారు వ్యాఖ్యలను ఖండించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా… మాజీ టీడీపీ నేత కవిత, ఖుష్బూ సుందర్, రాధిక శరత్ కుమార్ లు బండారు కామెంట్లపై ఘాటుగా స్పందించారు. బండారుకి కఠిన శిక్ష పడాలని అన్నారు. ఇదే క్రమంలో ఎంపీ నవనీత్ కౌర్ కూడా ఈ ఘటనపై స్పందించారు. తనదైన శైలిలో సీరియస్ గా రియాక్ట్ అయ్యారు.
ఇదే క్రమంలో… తాజాగా రమ్యకృష్ణ, మీనా కూడా బండారు వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇలా సినీ ఇండస్ట్రీకి చెందిన మహిళా ఆర్టిస్ట్ లు బండారు సత్యనారాయణను నేరుగా టార్గెట్ చేస్తున్నారు. బండారుకి తల్లి, చెల్లి, భార్య లేరా అని ఘాటుగా ప్రశ్నిస్తున్నారు. అలాంటి వారికి కుటుంబ సభ్యులైనా బుద్ధి చెప్పాలని సూచిస్తున్నారు. ఇదే సమయంలో రోజాకు క్షమాపణలు చెప్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
దీంతో టీడీపీ నేతలు సైలంట్ అయిపోయారు. నిన్నమొన్నటి వరకూ వెనకా ముందూ చూడకుండా సంస్కారం మరిచిన కొంతమంది నేతలు బండ్దారును సమర్ధించారు. ఆయన అరెస్టును ఖండించారు. ఇంతకంటే నీతిమాలిన చర్య మరొకటి ఉంటుందా అనే కామెట్లు వినిపించిన అనంతరం వారంతా సైలంట్ అయిపోయారు.
ఇప్పుడు ఇలా సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటీమనులు అంతా రోజాకు మద్దతుగా నిలుస్తూ… టీడీపీ నేత బండారును కడిగి పారేస్తుంటే… టీడీపీనేతలు సందిఘ్దంలో పడ్డారు. వారి అనుకూల మీడియా ఈ వార్తలను మాయం చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ… సోషల్ మీడియాలో మాత్రం ఈ వ్యవ్హారం వైరల్ అవుతుంది.
దీంతో… సీనియర్ ఆర్టిస్టులు అంతా కలిసి బండారుకు దిమ్మతిరిగించేలా ఉన్నారని అంటున్నారు పరిశీలకులు. ఈ సమయంలో ఉన్న కాస్త గౌరవం అయినా కాపాడుకోవాలనుకుంటే… వెంటనే రోజాకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని, ఫలితంగా ఇష్యూ ఇక్కడితో క్లోజ్ అయ్యే అవకాశం ఉందని… లేదంటే మరింత ముదిరి పాకనపడే ప్రమాదం లేకపోలేదని అంటున్నారు. మరి ప్రస్తుత పరిస్థితుల్లో బండారు… రోజాకు క్షమాపణలు చెప్పి వ్యవహారాన్ని చక్కబరుస్తారా.. లేక, తాను మునుగుతూ పార్టీ పుట్టే కూడా ముంచుతారా అనేది వేచి చూడాలి!