కళ్ళు బైర్లు కమ్మే కలెక్షన్స్.. మారిపోతున్న ఇండియన్ సినిమా జర్నీ!

సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది. కొత్త కొత్త కథలు ఎంచుకొని మన దర్శకులు సినిమాలను చేస్తూ ముందుకు సాగుతూ ఉంటే టాలెంటెడ్ హీరోలు వాటిని తమ నటనతో సినిమా ని కలెక్షన్ల పరంగా మరింత ముందుకు తీసుకు వెళుతున్నారు. ఒకప్పుడు సినిమా 100 కోట్లు కొల్లగొడితే ఆ సినిమా ఇండస్ట్రీ హిట్టు కింద కానీ ఇప్పుడు 1000 కోట్ల కలెక్షన్స్ సునాయాసంగా సాధిస్తున్నాయి నేటి సినిమాలు.

ఒక సినిమా వెయ్యి కోట్లు సాధించి ఇండస్ట్రీకు హిట్ కొట్టింది అని చెప్పే సమయానికి మరొక సినిమా అంతకుమించిన కలెక్షన్స్ తో ముందు సినిమా రికార్డులను తిరగ రాస్తుంది. ఇకపై 100 కోట్లు కలెక్షన్స్ సాధించిన సినిమాలు హిట్ సినిమాల కిందకి రావేమో అనే రేంజ్ లో ఒక్కొక్క సినిమా 1000 కోట్లు 1500 కోట్లు కలెక్షన్స్ సంపాదించి ఇండియన్ సినిమా జర్నీ ని మార్చేస్తున్నాయి. పుష్ప టు సినిమా అయితే 2000 కోట్లు కలెక్షన్స్ కి దగ్గరలో ఉంది.

ముందు బాహుబలి సినిమా 1000 కోట్ల కలెక్షన్స్ దాటిన తొలి తెలుగు సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది ఆ కలెక్షన్స్ చూసి అందరూ ఆశ్చర్యపోయే సమయానికి త్రిబుల్ ఆర్ సినిమా 1000 కోట్ల బెంచ్ మార్కుని దాటేసింది. ఇక వరుసగా కేజిఎఫ్, కల్కి, కేజీఎఫ్ టు వంటి సినిమాలు ఈజీగా 1000 కోట్ల మార్కుని దాటేసాయి.

ఇంత కలెక్షన్స్ సాధించటం సాధ్యమేనా అనే పరిస్థితి నుంచి ఇంత కలెక్షన్స్ రాబడితేనే సినిమా హిట్ అనే రేంజ్ కి వచ్చేసింది సినిమా ఇండస్ట్రీ. ఇప్పుడు పుష్ప టు సినిమా రికార్డ్స్ చూస్తే కళ్ళు బైర్లు కమ్మల్సిందే. మొదటిసారి సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో పాన్ ఇండియా మూవీగా వచ్చిన ఈ సినిమా అతి తక్కువ సమయంలోనే 1500 కోట్లు కొల్లగొట్టి రికార్డ్స్ క్రియేట్ చేసింది పుష్ప 2. టాలీవుడ్ లో వెయ్యి కోట్ల బెంచ్ మార్క్ దాటిన నాలుగవ హీరోగా తనకంటూ ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్నాడు అల్లు అర్జున్

Special Focus On Pan India Movies | 1000 కోట్లు..కొట్టినోడే మొనగాడా! | 10TV News