సంధ్య థియేటర్ దగ్గర జరిగిన సంఘటన పట్ల అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనం రేపాయి. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి జరిగిన సంఘటన గురించి మాట్లాడారు. సంధ్య థియేటర్ దగ్గర జరిగిన సంఘటన దురదృష్టకరమని బాధిత కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు చెప్పారు. నాపై చేసినవన్నీ తప్పుడు ఆరోపణలే నేను ఎలాంటి ర్యాలీ చేయలేదు.
థియేటర్ కి కొద్ది దూరంలో నా కారు ఆగిపోయింది, కారు ముందుకి కదల్లేదు చేయి చూపిస్తూ ముందుకే కదలండని పోలీసులు అంటేనే నేను బయటకు వచ్చి చేతులు ఊపుతూ థియేటర్ లోపలికి వచ్చాను. తర్వాత ఏ పోలీసు లోపలికి వచ్చి జరిగిన సంఘటన గురించి చెప్పలేదు. తర్వాత ధియేటర్ యాజమాన్యం వచ్చి జనాలు ఎక్కువగా ఉన్నారని చెప్పటంతో బయటికి వచ్చేసాను. అయితే మహిళ చనిపోయిన విషయం నాకు మరుసటి రోజు వరకు తెలియలేదు. తెలిసిన తర్వాత కూడా షాక్ లో ఉండిపోయాను అందుకే త్వరగా స్పందించలేకపోయాను.
విషయం తెలిసిన తర్వాత నేను వెళదాము అనుకున్నాను కానీ నా పై కేసు నమోదు చేశారని నా లీగల్ టీం వద్దని వారించడంతో నేను హాస్పిటల్ కి వెళ్ళలేదు. గతంలో పలువురు హీరోల అభిమానులు చనిపోతేనే పరామర్శించడానికి వెళ్ళాను అలాంటిది నా సొంత అభిమానులు చనిపోతే వెళ్లి పలకరించనా అన్నాడు. అలాగే సినిమా హిట్ అయిన నేపథ్యంలో దేశం మొత్తం మీద చాలా ఈవెంట్లు పెట్టాలని అనుకున్నాము కానీ ఈ ఘటన తర్వాత అన్నింటిని రద్దు చేసుకున్నాము.
బాధిత కుటుంబాన్ని పర్యమర్శించడానికి స్పెషల్ పర్మిషన్ తీసుకొని మా నాన్నను వెళ్ళమని చెప్పాను కుదరదు అన్నారు అలాగే సుకుమార్ గారిని కూడా వెళ్ళమంటే అది కుదరదు అన్నారు ఇప్పుడు నేను ఆ కుటుంబాన్ని పట్టించుకోవటం లేదని ఆరోపిస్తున్నారు, నా క్యారెక్టర్ని చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నారు అది మనసుకు తీసుకోలేకపోతున్నాను చాలా బాధగా ఉంది అని చెప్పుకొచ్చాడు అల్లు అర్జున్.