తనను తాను ఓ విజనరీ నాయకుడిగా తన అనుకూల మీడియా సహకారంతో చిత్రీకరించుకున్నారు. చంద్రబాబును ఓన్లీ బాబుగా, ఒన్ అండ్ ఓన్లీ విజనరీ పొలిటీషియన్ గా, సింగిల్ పీస్ సీఎం గా భ్రమింపచేయడానికి ఇంతకాలం ఆయన చేయని ప్రయత్నం లేదు. అయితే ఇలా ప్రచారం చేయించుకోవడంలో కొంతవరకూ సక్సెస్ కూడా అయ్యారు. అయితే… బాబు ఎంత విజన్ లేని మనిషో, ప్రజాధనాన్ని వృథాచేయడంలో ఏమాత్రం వెనక్కి తగ్గని నాయకుడో తెలిపే విషయాలు ప్రస్తుతం ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తున్నాయి.
టీడీపీ ప్రభుత్వ హయాంలో తాత్కాలిక సచివాలయం నిర్మించారు చంద్రబాబు. దీనికి రూ.750 ఖర్చు చేసినట్టు లెక్కలు చూపించారు. అయితే దీనిలో పెద్దఎత్తున అవినీతి జరిగిందని వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో ఆరోపించారు. వర్షాకాలంలో సచివాలయంలో నీరు కారుతున్న వీడియో, ఫొటోలతో సహా బయటపెట్టారు. ఇదే సమయంలో… “తాత్కాలికం” అన్న పదం ఉండటంతో… ఈ నిర్మాణాలు, దానికైన వ్యయాలపై కాగ్ ఆడిట్ ఉండదు.. ఇదేక్రమంలో కేంద్రానికి లెక్కలు చెప్పాల్సిన పని ఉండదూ అంటూ అప్పట్లో భారీ విమర్శలు వచ్చాయి!
అయితే తాజాగా రూ.600 కోట్లతో నిర్మించబడిన తెలంగాణ సచివాలయం బిల్డింగ్ ఫోటోలను… 750 కోట్ల రూపాయల ఏపీ తాత్కాలిక సచివాలయ భవనాన్ని కంపేర్ చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. ప్రజాధనాన్ని బాబు ఏరేంజ్ లో వృథా చేశారో ఈ ఫోటోలు చూస్తే అర్ధమవుతుంది అని ఒకరంటే… రూ.750 కోట్లలో చివరి సున్నా మాయం అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.
ఇదే క్రమంలో… రూ.900 కోట్లతో నిర్మించిన నూతన పార్లమెంట్ భవన్ ఫోటో పక్కన కూడా… బాబు హయాంలో 750 కోట్ల రూపాయలతో నిర్మితమైన టెంపరరీ సెక్రటేరియట్ బిల్డింగ్ ఫోటోలను కలిపి పోస్ట్ చేస్తున్నారు. ఫలితంగా… ఇది బాబు విజన్ అంటూ సెటైర్స్ వేస్తున్నారు. ఇలాంటి పనులు చేసిన చంద్రబాబు… మరోసారి అధికారం కావాలని అడగడం అర్ధరహితమని వాపోతున్నారు!