రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసే సమయంలో తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలివే?

హిందువులు కొన్ని రకాల వృక్షాలను కూడా ఎంతో పవిత్రమైనవిగా భావిస్తూ పూజిస్తుంటారు. ఇలా వేప రావి ఉసిరి వంటి వృక్షాలకు ప్రత్యేకంగా పూజలు చేస్తూ పూజిస్తూ ఉంటారు.ఇకపోతే రావి చెట్టులో సకల దేవతలు కొలువై ఉంటారని భావిస్తారు. ముఖ్యంగా ఈ చెట్టు వేర్లు కాండం కొమ్మలలో త్రిమూర్తులు కొలువై ఉంటారని భావిస్తారు.అందుకే చాలామంది ప్రతిరోజూ రావి చెట్టుకి కూడా ప్రదక్షిణలు చేస్తూ పూజలు చేస్తుంటారు.ఇక శని ప్రభావ దోషంతో బాధపడేవారు రావి చెట్టుకు శనివారం ఆవనూనెతో దీపాలు వెలిగించడం వల్ల శని ప్రభావ దోషం తొలగిపోతుందని భావిస్తారు.

ఎవరైతే రావి చెట్టుకు పూజ చేసి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తుంటారో అలాంటి వారు ప్రదక్షిణలు చేసే సమయంలో కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది.ఎప్పుడూ కూడా రావి చెట్టుకు సూర్యోదయం తర్వాత స్నానం ఆచరించి పూజ చేయాల్సి ఉంటుంది ఇక రావి చెట్టుకు పూజ చేసే ముందు ముందుగా గణపతికి పూజ చేసి సంకల్పం చేసుకోవాలి. అనంతరం రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసే సమయంలో విష్ణు సహస్రనామాలను చదువుతూ ప్రదక్షిణలు చేయాలి. ఇక రావి చెట్టును ఎప్పుడూ కూడా చేతితో తాకి నమస్కరించకూడదు. మంగళవారం ఆదివారం సమయంలో రావి చెట్టుకు సాయంత్రం పూజ చేయకూడదు.

ఇకపోతే శనివారం మినహా మిగిలిన రోజులన్నీ ప్రతి ప్రదక్షణం అనంతరం రావి చెట్టుకు నమస్కరించి తాకకుండా ప్రదక్షణలు చేయాలి. శనివారం మాత్రమే రావి చెట్టును చేతితో తాకి ప్రదక్షిణలు చేసి పూజ చేయాలి. ఇక శని ప్రభావంతో బాధపడేవారు రావి చెట్టు కింద శనివారం ఆవనూనెతో దీపం వెలిగించి పూజ చేయాలి.ఇలా పూజ చేయడంతో శని ప్రభావ దోషం తొలగిపోవడమే కాకుండా సకల దేవతల ఆశీర్వాదాలు ఎల్లవేళలా మనపై ఉంటాయి.