Vishnu: మంచు విష్ణు త్వరలోనే కన్నప్ప సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయినటువంటి కన్నప్ప సినిమాని ఏప్రిల్ 25వ తేదీ విడుదల చేయబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తునప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు అయితే తాజాగా మంచు విష్ణు ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈ సినిమా గురించి ఎన్నో విషయాలను తెలియచేశారు.
ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ.. కన్నప్ప సినిమాని మరోసారి ఈ ప్రపంచానికి తెలియచేయడం కోసం ఆ పరమశివుడు నన్ను ఎంపిక చేసుకున్నారేమో అని నేను భావిస్తూ ఉంటాను ఇంతమంది స్టార్స్ ఉండక ఈ సినిమా చేసే అదృష్టం నాకు రావడం ఒక వరం అని తెలిపారు. ఇక భక్తకన్నప్ప సినిమాలో రావు గోపాల్ రావు చేసినటువంటి పాత్రను కన్నప్ప సినిమాలో నాన్నగారు చేశారని విష్ణు తెలిపారు.
ఆ పాత్ర తీరుతెన్నులను మార్చడం జరిగింది. అలాగే ‘కన్నప్ప’ గురించి ఇంతవరకూ ప్రపంచానికి తెలిసిన విషయాలను అలాగే ఉంచి, మిగతా విషయాలను ఊహించి తయారు చేసుకోవడం జరిగింది అయితే ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో పరుచూరి గోపాలకృష్ణ గారు ఎంతో సహకరించారని తెలిపారు. ఇక ఈ సినిమాకు అద్భుతమైన లొకేషన్స్ దొరకడం కూడా ఆ శివయ్య అనుగ్రహమే అని తాను భావిస్తానని విష్ణు తెలిపారు.
ఇక ఈ సినిమాలో నేను కాకుండా ప్రభాస్ నటించిన ఉంటే చాలా బాగుండేదని మరికొందరు కూడా వారి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు నిజానికి ప్రభాస్ ki కనుక ఈ సినిమాలో నటించాలనీ ఉందని చెప్పి ఉంటే నేను ఈ సినిమా జోలికి అసలు వెళ్లే వాడిది కాదని విష్ణు తెలిపారు.కృష్ణంరాజు గారు ఉన్నప్పుడే, ఆయనతో ఈ ప్రాజెక్టును గురించి మాట్లాడి .. ఆయన ఆశీస్సులను అందుకోవడం జరిగింది. ఇక ఈ సినిమాలో శ్రీకాళహస్తిలో శివలింగం ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా చూపించడం నాకు చాలా సంతృప్తిని కలిగించిందని మంచు విష్ణు తెలిపారు.