Ntr: ఎన్టీఆర్ నటనపై ప్రశంసలు కురిపించిన జక్కన్న… ఆయన నటన అద్భుతం అంటూ!

Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎలా నటిస్తారో మనకు తెలిసిందే. ఎలాంటి సన్నివేశమైన ఆ సన్నివేశంలో పరకాయ ప్రవేశం చేసి ఆ సన్నివేశానికి తన పాత్రకు ప్రాణం పోస్తారు. అయితే తాజాగా ఎన్టీఆర్ నటన గురించి ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఆర్‌ఆర్‌ఆర్‌: బిహైండ్‌ అండ్‌ బియాండ్‌’ డాక్యుమెంటరీ జపాన్‌లో విడుదల కానుంది

ఈ క్రమంలోనే ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా రాజమౌళి జపాన్ వెళ్లారు. ఇక జపాన్లో ఓ ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ నటన గురించి రాజమౌళీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనగా మారాయి.ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలోని ‘కొమురం భీముడో’ పాట గురించి ప్రస్తావించారు. కొమురం భీముడో లాంటి ఒక కష్టమైన పాటను చిత్రీకరించడానికి నాకు చాలా సులభమైందని తెలిపారు.

ఇలా ఈ పాట నాకు సులభమైంది అంటే అందుకు కారణం ఎన్టీఆర్..అతడు గొప్ప నటుడని అందరికీ తెలుసు. కానీ, ప్రత్యేకించి ఆ పాటలో తారక్‌ నటన మరో స్థాయిలో ఉంటుంది. అతడి శరీరంలోని అణువణువుతోనూ హావభావాలు పలికించాడు. నేను ఆ పాట చిత్రీకరణలో అతడి ముఖంపై కెమెరా పెట్టి పాట ప్లే చేశాను అంతే. అది ఎంతో గొప్పగా వచ్చింది. ఈ పాట వెనక కొరియోగ్రాఫర్‌ ప్రతిభ కూడా ఉంది. తారక్‌ను ఎలా కట్టాలి, ఎలా వేలాడదీయాలో బాగా ఆలోచించి కొరియోగ్రఫీ చేశారు అంటూ ఈ పాట కొరియోగ్రాఫర్ పై అదేవిధంగా ఎన్టీఆర్ పై కూడా ప్రశంసలు కురిపించారు.

ఆర్‌ఆర్‌ఆర్‌: బిహైండ్‌ అండ్‌ బియాండ్‌ డాక్యుమెంటరీ నెట్ఫిక్స్ లో విడుదల అయ్యి ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే అయితే ఇప్పుడు దీనిని జపాన్లో విడుదల చేయబోతున్న నేపథ్యంలోనే అక్కడ ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.