Ntr: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న వారిలో నటుడు ఎన్టీఆర్ ఒకరు. ఈయన నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలోకి బాల నటుడిగానే అడుగుపెట్టి అనంతరం స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగారు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా కొనసాగుతున్న ఎన్టీఆర్ వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.
ఎన్టీఆర్ ఇటీవల దేవర సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇక ఈ సినిమా తర్వాత ప్రస్తుతం ఈయన ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో డ్రాగన్ అనే పాన్ ఇండియా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమాతో పాటు బాలీవుడ్ చిత్రం వార్ 2 లో కూడా ఎన్టీఆర్ నటిస్తున్నారు.
ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇలా ఎన్టీఆర్ తో కలిసి నటించిన తన అదృష్టం అంటూ హృతిక్ రోషన్ మాట్లాడారు. అదేవిధంగా ఎన్టీఆర్ గురించి కూడా ఎంతో గొప్పగా ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడారు. అయితే తాజాగా ఎన్టీఆర్ నటించిన సినిమాల గురించి కూడా హృతిక్ రోషన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
తనకు ఎన్టీఆర్ నటించిన సినిమాలలో జనతా గ్యారేజ్ సినిమా అంటే చాలా ఇష్టమని హృతిక్ రోషన్ తెలిపారు.ఆ సినిమా ను చాలా సార్లు చూశానని ఎన్టీఆర్ అందులో ఒక మెచ్యూర్డ్ పర్ఫామెన్స్ ఇచ్చాడని ఆ సినిమాని నేను చేసుంటే బాగుండేదని హృతిక్ రోషన్ పలు సందర్భాలలో భావించారట. ఇలా బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ వంటి గొప్ప నటుడు ఎన్టీఆర్ గురించి ఆయన నటన గురించి ఇంతలా ప్రశంసల కురిపించడంతో ఎన్టీఆర్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.