Donald Trump: హార్వర్డ్‌పై ట్రంప్ ఉక్కుపాదం.. విద్య, స్వేచ్ఛ మధ్య మళ్లీ సుద్దులాట

Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి హార్వర్డ్ విశ్వవిద్యాలయంపై తన దూకుడు చూపించారు. విదేశీ విద్యార్థుల కార్యకలాపాలపై పూర్తి సమాచారం ఇవ్వాలంటూ ట్రంప్ సర్కారు హెచ్చరించడంతో, ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయం మరో వివాదంలోకి జారింది. ఏప్రిల్ 30లోగా విదేశీ విద్యార్థులకు సంబంధించిన వివరాలు అందించ వారి ప్రవేశాధికారాన్ని నిలిపేస్తామని హోంశాఖ కార్యదర్శి క్రిస్టి నోయెమ్ తీవ్రంగా హెచ్చరించారు.

స్టూడెంట్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ (SEVP) కింద హార్వర్డ్ విద్యార్థులకు వీసా సౌకర్యం లభించేందుకు అవసరమైన అనుమతిని కోల్పోతుందన్న హెచ్చరికతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. దీనిపై హార్వర్డ్ యూనివర్సిటీ స్పష్టం చేసింది – ‘‘మేము చట్టప్రకారమే వ్యవహరిస్తాం. రాజ్యాంగ హక్కుల విషయంలో రాజీ పడలేం’’ అని తమ వైఖరిని తేల్చిచెప్పింది.

ఇంతటితో ట్రంప్ ఆగలేదు. హార్వర్డ్‌కు వర్తిస్తున్న పన్ను మినహాయింపుపై కూడా ప్రశ్నలు లేవనెత్తారు. ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్‌కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే 2 బిలియన్ డాలర్ల ఫెడరల్ నిధులు నిలిపివేయడం, పన్ను మినహాయింపు రద్దు దిశగా ప్రయత్నాలు జరగడం విద్యా, రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది.

ఇప్పటికే యూనివర్సిటీ ప్రాంగణాల్లో యూదులపై జరిగిన నిరసనల వల్ల ఈ వివాదం ముదిరినట్టు తెలుస్తోంది. ట్రంప్ ‘ట్రూత్ సోషల్’లో పేర్కొన్నట్టుగా హార్వర్డ్ ఒక రాజకీయ వేదికగా మారితే… ఆ సంస్థపై పన్నులు విధించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రపంచంలోని లక్షలాది మంది విద్యార్థులకు ఆశాజ్యోతి అయిన హార్వర్డ్‌పై ఈ దాడులు అమెరికాలో విద్యా స్వేచ్ఛపై పెద్ద చర్చకు దారితీస్తున్నాయి.

Public EXPOSED: Chandrababu & Pawan Kalyan Ruling || Ap Public Talk || Ys Jagan || Telugu Rajyam