Bandla Ganesh: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఇటీవల క్యాబినెట్ మీటింగ్ కు హాజరు కావాల్సి ఉండగా హైదరాబాద్ నుంచి ఏపీ సచివాలయానికి వచ్చిన పవన్ కళ్యాణ్ క్యాబినెట్ మీటింగ్ పాల్గొనలేకపోయారు. తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న నేపథ్యంలో ఈయన క్యాబినెట్ మీటింగ్ నుంచి వెళ్లిపోయారు.
ఇకపోతే ఇటీవల పవన్ కళ్యాణ్ చేతికి సెలైన్ డ్రిప్ తో కనిపించారు పవన్ కల్యాణ్. దీంతో ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక పవన్ ఈ ఏడాది ఫిబ్రవరిలో జ్వరంతోపాటు స్పాండిలైటిస్ అనే సమస్యతో బాధపడిన సంగతి తెలిసిందే. ఇలా తరచు పవన్ కళ్యాణ్ తీవ్రమైన అనారోగ్య సమస్యలకు గురి అవుతున్నారు.
ఇలా పవన్ కళ్యాణ్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నేపథ్యంలో అభిమానులు ఎంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొద్దిరోజులు పాటు సినిమాలు రాజకీయాలను పక్కనపెట్టి మీ ఆరోగ్యం పై దృష్టి సారించండి అంటూ పవన్ కళ్యాణ్ కు అభిమానులు సలహాలు ఇస్తున్నారు. ఇలాంటి తరుణంలోనే పవన్ కళ్యాణ్ వీరాభిమాని సినీ నిర్మాత నటుడు బండ్ల గణేష్ సైతం స్పందించారు.
ఈ సందర్భంగా బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ…పని అంటే మీరు ఎంత కష్టపడతారో నాకు బాగా తెలుసు.. నడుము విరిగిపోయినా గుర్రపు మీద స్వారీ చేస్తారు.. 103 జ్వరం ఉన్నా డాన్సులు చేస్తారు.. మీకు ప్రజల మీద ఉన్న కమిట్మెంట్ ఏంటో నాకు తెలుసు, కానీ మీ ఆరోగ్యం జాగ్రత్త అంటూ బండ్ల గణేష్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.
ఇక ఈ ట్వీట్ పవన్ కళ్యాణ్ అభిమానులను ఆకట్టుకోవడంతో ఎన్నో ప్రశ్నలు వేస్తున్నారు.పవన్ కల్యాణ్ గెలిచిన తర్వాత, డిప్యూటీ సీఎం అయిన తరువాత మీరు ఆయన్ని మీట్ అయ్యారా? కుదిరితే ఒకసారి ఇప్పుడు కలిసి.. ఇద్దర్ని కలిపి ఒక ఫ్రేమ్ లో చూపించే ప్రయత్నం చేయండి అంటూ కామెంట్లు చేస్తున్నారు.