Sunrisers Hyderabad: SRHలో మరో యువ అస్త్రం.. ఇలాంటోడే కావాలి!

2025 సీజన్ లో SRH జట్టు కాస్త తడబడుతూ సాగుతోంది. వరుస ఓటముల అనంతరం ఈమధ్య మళ్ళీ ఫామ్ లోకి వచ్చింది. అయితే ఓపెనింగ్ బ్యాట్స్ మెన్స్ చేతులు ఎత్తేసిన ప్రతీసారి కూడా మిగతా బ్యాట్స్ మెన్స్ కూడా వెంటవెంటనే అవుతావుతున్నారు. వికెట్ ఆపుతూ స్కోరుని పెంచే ఆటగాళ్లు జట్టులో కరువయ్యారనే వాదన ఉంది. ఆడితే అందరూ బాగానే ఆడుతున్నారు. లేదంటే వరుసగా పెవిలియన్ కి క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో హఠాత్తుగా ఇప్పుడు ఒక యువ నిలకడ కలిగిన అస్ట్రాన్నీ SRH రంగంలోకి దింపనున్నట్లు తెలుస్తోంది.

అతన్ని ఇంపాక్ట్ ప్లేయర్ కింద కూడా వాడుకునే అవకాశం ఉంది. వివరాల్లోకి వెళితే.. ఐపీఎల్‌ 2025 సీజన్‌కు ముందు వరకూ రవిచంద్రన్ స్మరాన్‌ పేరు చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ ఇప్పుడు అదే పేరు యువ క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో తన విధ్వంసకర ఆటతీరుతో ఆర్సీబీ క్యాంప్‌ను షేక్ చేసిన స్మరాన్‌కు చివరకు చోటు దక్కలేదు.

కానీ ఆ వేగవంతమైన బ్యాటింగ్‌ను గమనించిన మరో ఫ్రాంఛైజీ మాత్రం అతనిని పట్టేసింది. అదే సన్‌రైజర్స్ హైదరాబాద్. ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా గాయంతో తప్పుకోగా.. అతడి స్థానాన్ని భర్తీ చేస్తూ ఈ కొత్త అస్త్రాన్ని ఎంచుకుంది. స్మరాన్‌ను రూ.30 లక్షల బేస్ ధరకు తీసుకోవడం విశేషం. స్మరాన్‌ స్టాటిస్టిక్స్ గమనిస్తే ఈ ఎంపిక సాధారణంగా కనిపించదు. ఇప్పటివరకు అతడు కేవలం 7 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లే ఆడినా, అందులోనే 500 పైచిలుకు పరుగులు చేసి 64.50 సగటుతో నిలిచాడు.

పంజాబ్‌పై డబుల్ సెంచరీ చేయడం అతడి సామర్థ్యానికి ఓ పరిమాణం. 2024లో లిస్ట్ A మ్యాచ్‌ల్లో అతడు కేవలం 10 గేమ్స్‌లోనే రెండు శతకాలు కొట్టి 433 పరుగులు చేయడం విశేషం. ఈ పరిపక్వతే అతనిని SRH జట్టుకు సరైన ఆప్షన్‌గా మార్చింది. ఆర్సీబీ ప్రీ క్యాంప్‌లో అతడు 33 బంతుల్లో 88 పరుగులు చేసి టాప్ క్లాష్ ఫామ్ ను చూపాడు. కానీ అక్కడ తుది జట్టులో చోటు దక్కలేదు. ఆ ఒడిదుడుకుల మధ్య అతడి ప్రయాణం SRHతో కొత్త మలుపు తిరిగింది. బ్యాటింగ్‌ స్పెషలిస్ట్‌గా దూకుడైన మిడిల్ ఆర్డర్ ఆప్షన్‌గా అతడు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. SRH జట్టులో ఇప్పటికే ఫ్లెక్సిబుల్ ఆటగాళ్లు ఉన్నా.. స్మరాన్ వంటి స్ట్రైక్ రేట్ పద్ధతిలో ఆడగల బ్యాట్స్‌మెన్ లేనిది గమనార్హం.

ఐరన్ లెగ్|| Director Geetha Krishna Shocking Comments On Pawan Kalyan, Naga Babu & Chiranjeevi || TR