భోజనం చేసిన వెంటనే అదే ప్లేటులో చేయి కడుగుతున్నారా.. ఇది తెలుసుకోవాల్సిందే!

సాధారణంగా మనం భోజనం చేసిన తరువాత ఎక్కువమంది మనం తిన్న ప్లేట్లోనే చేతులు కడగడం చేస్తుంటారు. ఇలా తిన్న ప్లేట్ లోనే చేతులు కడగడం మంచిదని పెద్దవాళ్లు కూడా చెబుతుంటారు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనం తిన్న ప్లేట్ లోనే చేయి కడగడం పూర్తిగా తప్పని పండితులు చెబుతున్నారు. మనం తిన్న తర్వాత ఆ ప్లేట్ తీసుకెళ్లి ఒకచోట పెట్టి అనంతరం చేయి బయట కడుక్కోవాలని తెలియజేస్తున్నారు. ఈ విధంగా మనం తిన్న ప్లేట్లోనే చేయి కడగడం వల్ల దరిద్ర దేవత ఆవహిస్తుందని పండితులు చెబుతున్నారు.

అన్నం పరబ్రహ్మ స్వరూపం ప్రతి ఒక్కరూ అన్నాన్ని అన్నపూర్ణ దేవిగా భావించి భోజనం చేసేముందు అన్నపూర్ణాదేవికి నమస్కరించుకొని భోజనం చేస్తుంటారు.అయితే భోజనం పూర్తయిన తర్వాత ఆ చేయిని ప్లేట్లోనే కడగటం వల్ల మనం అన్నపూర్ణ దేవిని అపహాస్యం చేసినట్లేనని పండితులు చెబుతున్నారు.ఇకపోతే చాలామంది భోజనం చేసేటప్పుడు అన్నం మొత్తం కింద పడేస్తూ తినడం లేదా అటు ఇటు తిరుగుతూ తినడం చేస్తుంటారు.

ఈ విధంగా అన్నం తినేటప్పుడు పొరపాటున కూడా నిలబడి తిరుగుతూ భోజనం చేయకూడదని పండితులు చెబుతున్నారు.అలాగే ప్లేట్ మనపై పెట్టుకుని ఎప్పుడూ కూడా భోజనం చేయకూడదు నేలపై ప్లేట్ పెట్టుకొని వంగి మనం భోజనం చేయాలి. అదేవిధంగామనం భోజనం చేసేటప్పుడు చేయి మొత్తం అన్నం కాకూడదు కేవలం చేతివేళ్లను మాత్రమే భోజనం చేయడానికి ఉపయోగించాలి.ఇలా మనం భోజనం చేసే దాన్ని బట్టి చాలామంది మన వ్యక్తిత్వాన్ని కూడా అంచనా వేస్తూ ఉంటారు కనుక భోజనం చేసే సమయంలో పలు జాగ్రత్తలు పాటించడం ఎంతో మంచిది.