పూజా సమయంలో ఈ పొరపాట్ల వల్ల ఎన్ని సమస్యలు ఎదురవుతాయో తెలుసా..?

సాధారణంగా మన భారతదేశంలో ప్రజలందరూ ప్రతిరోజు ఇంట్లో దేవాలయాలలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఇలా ప్రతిరోజు ఉదయం సాయంత్రం దేవుడికి పూజ చేసి దీపం వెలిగించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని ప్రజల నమ్మకం. అందువల్ల ప్రతి ఒక్కరూ ఉదయం లేచిన వెంటనే ఇల్లు శుభ్రం చేసుకొని అలాంటి స్నానం చేసి దేవుడి గదిలో దీపారాధన చేస్తూ ఉంటారు. అలాగే కొంతమంది భక్తులు దేవాలయాలకు వెళ్లి అక్కడ దేవుడికి పూజలు చేస్తూ ఉంటారు. అయితే ప్రతిరోజు ఇలా చేసే పూజా విధానంలో మనకు తెలియకుండా చేసే కొన్ని పొరపాట్ల వల్ల శుభ ఫలితాలు కాకుండా అశుభ ఫలితాలు అవకాశం ఉంటుంది అందువల్ల ప్రతి ఒక్కరూ ఇంట్లో కాని దేవాలయాలలో కానీ పూజ చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటిస్తూ పొరపాట్లు జరగకుండా జాగ్రత్త వహించాలి.

పూజ చేసే సమయంలో చేయకూడని పొరపాట్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సాధారణంగా ప్రతి ఇంట్లో ఈశాన్య దిక్కున పూజగది ఉండేలా చూసుకోవాలి. ఈశాన్య దిశలో దేవుడి గది ఉండటం శుభప్రదంగా భావిస్తారు. ప్రతిరోజు ఈశాన్య దిశగా దేవుడిని ఆరాధించటం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి తొలగిపోయి అనుకూల శక్తి వస్తుంది. దేవుడిని పూజించే సమయంలో ప్రతిరోజు నైవేద్యం సమర్పించి పూజించటం వల్ల ఇంట్లో ధనధాన్యాలకు ఎటువంటి లోటు ఉండదు.

ఇక మనకి ప్రతిరోజు దర్శనం ఇచ్చి ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు. అందువల్ల ప్రతిరోజు మనం పూజ గదిలో ఉన్న దేవుళ్లను పూజించడమే కాకుండా సూర్యభగవానుడిని కూడా పూజించాలి. ఇలా సూర్యభగవానుడికి నీరు సమర్పించి పూజించటం వల్ల అదృష్టం పెరగడమే కాకుండా సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. పూజ చేసేటప్పుడు చాలామంది చేసే అతి పెద్ద పొరపాటు నేలపై కూర్చొని పూజ చేయటం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పూజ సమయంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఆసనం వేసి పూజ చేయాలి. ఇలా చేయటం వల్ల మీ పూజకి ఫలితం దక్కుతుంది. ఇలా చేయటం వల్ల ఇంటి నుంచి ప్రతికూల శక్తులు దూరమై శుభ ఫలితాలు పొందడానికి ఉదయం, సాయంత్రం దేవాలయంలో దీపం వెలిగించడం ఎంతో మంచిది.