Ntr: మళ్లీ జన్మంటూ ఉంటే ఎన్టీఆర్ అలా పుట్టాలి అనుకుంటున్నారా…. అసలు ఊహించలేదుగా?

Ntr: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం స్ట్రాంగ్ లైనప్ తో దూసుకుపోతున్నాడు. ఆర్ఆర్ఆర్ తో వచ్చిన ప్యాన్ ఇండియా ఇమేజ్ ను నిలబెట్టుకుంటూ అదే రేంజ్ సినిమాలను ఎంపిక చేసుకుంటూ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా అవుతున్నారు. ఇలా వరుస సినిమాలలో నటిస్తున్న ఎన్టీఆర్ అన్ని సినిమాలను కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు.

ప్రస్తుతం ఈయన బాలీవుడ్ చిత్రం వార్ 2 సినిమాలో నటిస్తున్నారు. అదేవిధంగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో రాబోతున్న డ్రాగన్ అనే సినిమా షూటింగ్ పనులలో కూడా ఎంతో బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. ఇకపోతే తాజాగా ఈయన దేవర సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు. ఇటీవల ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. అయితే ప్రస్తుత ఈ సినిమాని జపాన్ లో విడుదల చేసిన నేపథ్యంలో అక్కడ ఎన్టీఆర్ పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

డైరెక్టర్ కొరటాల శివతో కలిసి ఈయన వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈయనకు ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురయింది. మీకు మళ్ళీ జన్మంటూ ఉంటే ఎలా పుట్టాలని కోరుకుంటున్నారు అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ఎన్టీఆర్ తన తాత ఎన్టీ రామారావు గారి లాగా లేదా తన తండ్రికి కొడుకు లాగా పుట్టాలని మాత్రం కోరుకోలేదు. తాను మరో జన్మంటూ ఉంటే ఒక మంచి చెఫ్ కావాలని కోరుకుంటున్నాను అంటూ సమాధానం ఇచ్చారు.

జపాన్ లో ఫేమస్ వంటకంలో మరింత ఎక్స్ పర్ట్ అనిపించుకోవాలనుకుంటున్నా అని చెప్పి ఆశ్చర్యపరిచాడు. ఇండస్ట్రీ మొత్తం తెలుసు ఎన్టీఆర్ మాంచి చేయి తిరిగిన వంటకాడు అని. అందుకే ఇలా చెప్పాడేమో కానీ.. ఇలా చెప్పడం మాత్రం అందరిని ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేసింది.