Prabhas: ప్రభాస్ మంచి మనసు… కృష్ణంరాజు కలను నెరవేర్చబోతున్న హీరో… గ్రేట్ అంటూ!

Prabhas: ప్రభాస్ పేరు చెప్పగానే ముందుగా ఆయన ఇచ్చే ఆతిథ్యమే గుర్తుకు వస్తుంది. చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఒకే విధమైనటువంటి ఆహార పదార్థాలను కడుపు నిండా పెడుతూ తన మంచి మనసును చాటుకుంటూ ఉంటారు. ఇండస్ట్రీకి సంబంధించిన వారిని ఎవరిని అడిగినా ప్రభాస్ కృష్ణంరాజు గురించి ముందు ఈ మాటలే చెబుతారు. శత్రువు గడప తొక్కి ఇంటికి వచ్చిన వారికి కడుపునిండా అన్నం పెట్టి పంపించాలన్నది కృష్ణంరాజు గారి సిద్ధాంతం.

అదే అలవాట్లను తన పిల్లలకు కూడా నేర్పించారు. ఇప్పటికీ ప్రభాస్ ఇలాంటి అలవాట్లతో తన ఆతిథ్యంతో ఎంతోమంది కడుపు నింపుతున్నారు. ఇక ఎవరైనా ఆపదలో ఉన్నాము అని తెలిస్తే చాలు వారికి తనదైన శైలిలోనూ ప్రభాస్ సహాయం చేస్తుంటారు కానీ ఆ సహాయాన్ని మాత్రం ఎప్పుడు బయటకు చెప్పుకోరు. ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన ప్రభాస్ త్వరలోనే తన పెదనాన్న కృష్ణంరాజు గారి కోరికను కూడా తీర్చబోతున్నారని తెలుస్తోంది.

ప్రభాస్ సపోర్టుతో రెబల్‌స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామలా దేవి కలిసి ఓ హాస్పిటల్ నిర్మించి పేదలకు వైద్యం అందించాలనుకుంటున్నారట. మధుమేహం భారినపడి గ్రామీణ ప్రాంతాల్లో అనేకమంది పేదలు కాళ్లు, చేతి వేళ్లు కోల్పోవడం చూసి రెబల్‌స్టార్ కృష్ణంరాజు చలించిపోయేవారట. ఈ ఘటనలు చూసి చలించిపోయిన ఆయన ఏదోరంగా తన ప్రాంతంలోని ప్రజలకు మధుమేహంపై అవగాహన కల్పించాలని పరితపించే వారిని శ్యామల దేవి తెలిపారు.

యూకే ఇండియా ఫౌండేషన్ అనే సంస్థ ద్వారా కృష్ణం రాజుకు వీరాభిమాని అయిన డాక్టర్ వేణు కవతప్‌, 20 మంది అపోలో వైద్యుల బృందం ఆధ్వర్యంలో భీమవరం చుట్టుపక్కల ప్రాంతంలోని షుగర్ బాధితులకు ఉచితంగా వైద్య సేవలను అందిస్తున్న విషయాన్ని శ్యామలాదేవి తెలిపారు.ఈ విషయంలో ప్రభాస్‌కు తన వంతు సహాయం చేస్తున్నట్లు ఆమె చెప్పుకొచ్చారు. త్వరలో ఓ ఆసుపత్రిని నిర్మించి భారతదేశంలోని ఏప్రాంతం వారైనా వచ్చి ఉచితంగా వైద్యం పొందేలా సకల సౌకర్యాలతో హాస్పిటల్ ఏర్పాటు చేస్తామని శ్యామలాదేవి తెలిపారు. ఈ విషయంలో ప్రభాస్ మద్దతు కూడా పూర్తిగా ఉంటుందని తద్వారా తన పెదనాన్న కృష్ణంరాజు గారి కోరికను కూడా నెరవేర్చబోతున్నారని తెలియజేశారు.