Dulquer Salman: దుల్కర్ సల్మాన్ పరిచయం అవసరం లేని పేరు. మళయాళ చిత్ర పరిశ్రమలో హీరోగా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్న దుల్కర్ తెలుగులో కూడా అదే ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. తెలుగులో ఈయన మహానటి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో జెమినీ గణేషన్ పాత్ర ద్వారా ప్రేక్షకులను మెప్పించారు. అనంతరం సీతారామం సినిమా ద్వారా హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చి తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు.
ఈ సినిమా తర్వాత ఈయన నటించిన సినిమాలన్నీ కూడా తెలుగులో విడుదలవుతూ ఇక్కడ ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి. ఇక తాజాగా లక్కీ భాస్కర్ అనే సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న దుల్కర్ సల్మాన్ కి సంబంధించి ఒక వార్తా ప్రస్తుతం వైరల్ అవుతుంది. తాజాగా ఈయన యంగ్ ఏజ్ లో ఉన్నటువంటి ఒక ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతుంది. అయితే ఈ ఫోటోలో దుల్కర్ లుక్ చాలా భిన్నంగా ఉంది. ఈ ఫోటోలలో ఈయనని గుర్తుపట్టలేనంతగా ఉన్నారు.
ఇలా విభిన్నమైనటువంటి లుక్ నుంచి ఎంతో హ్యాండ్సమ్ గా ఈయన మారిపోవడంతో చాలామంది అభిమానులు దుల్కర్ సల్మాన్ కూడా అందం పెంచుకోవడం కోసం ఇలా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారా అంటూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.ఇప్పుడు మలయాళ ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. గతంలో కూడా ప్రముఖ డాక్టర్ మిధున్ కూడా ఈ విషయాన్ని తెలియజేయడంతో మరోసారి ఈ విషయం గురించి చర్చలు మొదలయ్యాయి. ఇక సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరోలు మరింత అందంగా కనిపించడం కోసం ఇలా ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకోవడం అనేది సర్వసాధారణం అనీ చెప్పాలి.